Jio Prepaid Plans: దేశంలో అతిపెద్ద టెలీకం కంపెనీగా అవతరించిన రిలయన్స్ జియో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లు అందిస్తుంటోంది. క్రికెట్ సీజన్ దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు కొత్తగా 40 జీబీ వరకూ ఉచితంగా డేటా అందిస్తోంది.
ఐపీఎల్ 2023 నేపధ్యంలో జియో సినిమాకు ఆదరణ పెరిగింది. ఓ వైపు క్రికెట్ మరోవైపు కొత్త కొత్త సినిమాలతో జియో సినిమా సరికొత్తగా ఆకట్టుకుంటోంది. దాంతో డేటా వినిమయం అధికమైంది. మరోవైపు వేసవి సెలవులు కావడంతో కాలక్షేపం కోసం ఇంటర్నెట్‌పై ఆధారపడుతున్నారు. డేటా వినిమయం, కస్టమర్ల అవసరాల్ని పరిగణలో తిసుకుని రిలయన్స్ జియో ఇప్పుుడు కొత్తగా క్రికెట్ ప్లాన్స్ అందిస్తోంది. ఇందులో డేటా అత్యధికంగా లభిస్తుంది. అంటే రోజుకు 3 జీబీ వరకూ అందించే విభిన్న ప్లాన్స్ ఉన్నాయి. ఏ విధమైన బఫరింగ్ లేకుండా స్ట్రీమింగ్ ఎంజాయ్ చేసేందుకు ఈ డేటా సరిపోతుంది. మరోవైపు కొన్ని ప్లాన్స్‌పై 40 జీబీ వరకూ డేటా ఉచితంగా ఇస్తోంది. 40 జీబీ డేటాను ఉచితంగా అందిస్తున్న ప్లాన్స్‌లో జియో ప్రీపెయిడ్ 219, 399, 999 రూపాయలు ఉన్నాయి. ఈ ప్లాన్స్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
జియో 219 రూపాయల ప్రీ పెయిడ్ ప్లాన్
రిలయన్స్ జియో అందిస్తున్న తక్కువ ఖరీదైన ప్లాన్ అది. కేవలం 219 రూపాయల ప్లాన్‌తో రోజుకు 3 జీబీ డేటా అందిస్తుంది జియో. అయితే ఈ ప్లాన్ కాల పరిమితి 28 రోజులు కాదు. కేవలం 14 రోజులు మాత్రమే. రోజుకు 3 జీబీ డేటాతో పాటు అపరిమితమైన వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. మరోవైపు రోజుకు 25 రూపాయల విలువైన 2 జీబీ డేటాను అందించే యాడ్ ఆన్ వోచర్ ఫ్రీ ఆఫర్.
జియో 399 రూపాయల ప్రీ పెయిడ్ ప్లాన్
ఈ ప్లాన్ ప్రకారం రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల వరకూ ఉచితంగా పంపించుకోవచ్చు. అపరిమితమైన వాయిస్ కాల్స్ సౌకర్యం ఉంటుంది. దీంతో పాటు జియో యాప్స్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. రోజుకు 3 జీబీ డేటాతో పాటు 61 రూపాయల విలువైన 6 జీబీ డేటా ఆన్ వోచర్‌గా లభిస్తుంది.
జియో 999 రూపాయల ప్రీ పెయిడ్ ప్లాన్
రిలయన్స్ జియో అందించే మరో అద్భుతమైన ప్లాన్ ఇది. 84 రోజుల కాల పరిమితితో 999 రూపాయలు అందుతోంది. ఇందులో రోజుకు 3 జీబీ డేటాతో పాటు అపరిమితమైన వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ఆఫర్‌లో కొనుగోలుదారులకు 241 రూపాయల విలువైన 40 జీబీ డేటా యాడ్ ఆన్ వోచర్‌గా లభిస్తుంది. ఈ మూడు ప్లాన్స్‌తో పాటు 50 జీబీ, 100 జీబీ, 150 జీబీ డేటా అందించే 222 రూపాయలు 444 రూపాయలు, 667 రూపాయల విలువ చేసే క్రికెట్ యాడ్ ఆన్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఇందులో 444 రూపాయల ప్రీ పెయిడ్ ప్లాన్ 60 రోజుల కాల పరిమితితో, 667 రూపాయల ప్రీ పెయిడ్ ప్లాన్ 90 రోజుల కాల పరిమితితో ఉన్నాయి. ఇక 222 రూపాయల ప్లాన్ ప్రస్తుతం ఉన్న యాక్టివ్ ప్లాన్ కాల పరిమితి ఉన్నంతవరకూ ఉంటుంది.
Also read: Best CNG Cars Under Rs 3 lakhs: రూ. 3 లక్షల్లోపే ఎక్కువ మైలేజ్ ఇచ్చే బెస్ట్ సీఎన్జీ కార్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook