Mustard Seeds Benefits: పోపు దినుసులు ఎక్కువగా వినియోగించేటివి ఆవాలే.. ఇవి చూడడానికి చిన్నవిగా ఉన్న వంటకానికి రుచిని అందించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇవి రుచినందించడమే కాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలకు ఔషధంగా కూడా సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ఔషధంగా పనిచేస్తాయి. ముఖ్యంగా చర్మ సమస్యలతో బాధపడుతున్న వారికి ఆవాలు ప్రభావవంతంగా సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
చాలామందిలో శరీరానికి వేడిని కలిగించే ఆహార పదార్థాలు తినడం వల్ల చర్మంపై దురద దద్దుర్లు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఆవాలని వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే మూలకాలు చర్మం పై సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ చిట్కాని వినియోగించడానికి మీరు ముందుగా.. 20 గ్రాముల ఆవాలను తీసుకొని ఓ బౌల్లో వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత వీటిని మిక్సీలో వేసి పొడిలా తయారు చేసుకోవాలి. ఇందులోనే నీటిని అప్లై చేసి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ని దురద ఉన్న ప్రదేశంలో అప్లై చేసి 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే సులభంగా ఉపశమనం లభిస్తుంది.
అంతేకాకుండా ప్రస్తుతం చాలామంది అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల పొట్ట సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఆవాలతో తయారుచేసిన 20 మిల్లీ గ్రాముల ఉండను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా పొట్ట సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయ ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఆవాల నూనెతో కూడా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. జుట్టుకు వినియోగించడం వల్ల జుట్టు రాలడం తలలోని చుండ్రు ఇతర జుట్టు సమస్యలు సులభంగా దూరమవుతాయి. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఆవాలతో తయారుచేసిన నూనె ప్రభావవంతంగా సహాయపడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి