PBKS vs DC: టాస్ గెలిచిన పంజాబ్.. స్టార్ ప్లేయర్స్ వచ్చేశారు! తుది జట్లు ఇవే

Punjab Kings vs Delhi Capitals Playing 11 Out. ఐపీఎల్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : May 17, 2023, 07:38 PM IST
PBKS vs DC: టాస్ గెలిచిన పంజాబ్.. స్టార్ ప్లేయర్స్ వచ్చేశారు! తుది జట్లు ఇవే

PBKS vs DC IPL 2023 64th Match Live Score Updates: ఐపీఎల్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం పంజాబ్ రెండు మార్పులు చేసింది. అథర్వ తైదే, కగిసో రబడ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు మిచెల్ మార్ష్ గాయానికి గురయ్యాడని ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ చెప్పాడు. 

ప్లే ఆ‍ఫ్స్‌ రేసులో నిలవాలంటే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తప్పక గెలవాల్సి ఉంది. 16 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 6 పరాజయాలతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. నేటి మ్యాచ్‌లో పంజాబ్‌ భారీ తేడాతో గెలిస్తే.. పాయింట్ల పట్టికలో ఒ‍క్కసారిగా భారీ జంప్‌ కొడుతుంది. 8వ స్థానం నుంచి ఏకంగా నాలుగో స్థానానికి ఎగబాకుతుంది. ఇక  ఢిల్లీ ఇదివరకే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించడంతో.. గెలుపోటములతో ఒరిగేది ఏమీ ఉండదు.

తుది జట్లు:
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్‌), అథర్వ టైడే, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్‌ కీపర్‌), సామ్ కుర్రాన్, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్, కగిసో రబాడ, నాథన్ ఎల్లిస్, అర్ష్‌దీప్ సింగ్. 
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌), పృథ్వీ షా, ఫిలిప్ సాల్ట్ (వికెట్‌ కీపర్‌), రిలీ రోసోవ్, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, యష్ ధుల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్టే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్. 

ఇంపాక్ట్ ప్లేయర్స్:
ఢిల్లీ క్యాపిటల్స్: ముఖేష్ కుమార్, అభిషేక్ పోరెల్, రిపాల్ పటేల్, ప్రవీణ్ దూబే, సర్ఫరాజ్ ఖాన్. 
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సికందర్ రజా, మాథ్యూ షార్ట్, రిషి ధావన్, మోహిత్ రాథీ. 

Also Read: XUV400 Vs Nexon EV: టాటా నెక్సాన్ ఈవీ vs మహీంద్రా ఎక్స్‌యూవీ400.. బ్యాటరీ, రేంజ్ వివరాలు ఇవే!  

Also Read: Malavika Mohanan Hot Pics: మాళవిక మోహనన్ హాట్ వర్కౌట్స్.. నాభి అందాలతో మంటలు రేపుతున్న మలయాళ బ్యూటీ!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News