Drinking Water Habits: ఆధునిక బిజీ ప్రపంచంలో మనం పాటించే విధానాలు, మన అలవాట్లు అనారోగ్యానికి కారణమౌతుంటాయి. ఇందులో అతి ముఖ్యమైంది నిలబడి నీళ్లు తాగడం. నిలబడి నీళ్లు తాగడం ఏ మాత్రం మంచి అలవాటు కాదు. దీనివల్ల ఆరోగ్యానికి చాలా హానికరమంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..
నిలబడి నీళ్లు తాగవద్దని పెద్దలు పదే పదే చెబుతుంటారు. ఇది నిజం కూడా. మనిషి శరీరానికి అత్యవసరమైన నీళ్లు తాగేటప్పుడు పోశ్చర్ కూడా సరిగ్గా ఉండాలి. నిలబడి నీళ్లు తాగడమనేది శరీరంలో నీరు నేరుగా ప్రవేశించే వేగాన్ని నిర్ణయిస్తుంది. ఇలా నిలబడి తాగడం వల్ల మనిషి శరీరంపై ఆ నీరు ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. నీళ్లు తాగేటప్పుడు మీ బాడీ పోశ్చర్ ఎలా ఉందనేది కచ్చితంగా కీలక పాత్ర వహిస్తుందంటున్నారు ప్రముఖ న్యూట్రిషన్లు. మనం తరచూ అదే పనిగా నీళ్లు నిలబడి తాగుతుంటే నరాలు ఓ విధమైన ఒత్తిడిలో ఉంటాయి. ఫలితంగా ఫ్లూయిడ్స్ అనేవి అజీర్ణానికి, విష పదార్ధాలకు దారితీస్తాయి.
నిలబడి నీళ్లు తాగడం వల్ల నీళ్ల వల్ల కలిగే ప్రయోజనాల్ని శరీరం గ్రహించకుండా అడ్డుపడుతుంది. నిలబడి నీళ్లు తాగినప్పుడు ఆ నీరంతా ఒత్తిడితో ఈసోఫేగస్ నుంచి లోయర్ స్టమక్ ద్వారా వెళ్తూ అన్ని భాగాల్ని దెబ్బతీస్తుంది. దీర్ఘకాలంలో ఈ అలవాటు మొత్తం జీర్ణవ్యవస్థ, ఇతర అంగాలకు ఆటంకం కల్గిస్తుంది. అదే సమయంలో నీటి ఉష్ణోగ్రత కూడా శరీరంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే చల్లని నీళ్లు తాగడం శరీరానికి మంచిది కాదు.
నిలబడి నీళ్లు తాగినప్పుడు ఫ్లూయిడ్స్ అనేవి ఏ విధమైన ఫిల్టరేషన్ లేకుండానే ఒత్తిడితో లోయర్ స్టమక్‌కు వెళ్లిపోతాయి. ఫలితంగా నీళ్లలో ఉండే వ్యర్ధాలు బ్లేడర్‌లో పేరుకుపోతాయి. ఇది కిడ్నీలను దెబ్బతీస్తుంది. అదే సమయంలో నిలబడి నీళ్లు తాగడం వల్ల దాహం కూడా తీరదని అంటారు.
నిలబడి నీళ్లు తాగడం వల్ల ఆర్థరైటిస్, జాయింట్ డ్యామేజ్ వంటి సమస్యలు ఏర్పడతాయి. నిలబడి నీళ్లు తాగినప్పుడు హై ప్రెషర్ గాలితో కలిసి నీళ్లు వేగంగా కిందకు ప్రవహించి మొత్తం వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఈ అలవాటు హార్ట్, ఊపిరితిత్తుల సమస్యకు కూడా కారణం కావచ్చు.
Also read: Hiccups: తరచూ అదే పనిగా వెక్కిళ్లు వస్తున్నాయా, నిర్లక్ష్యం వద్దు, వెక్కిళ్లకు కారణాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook