Pigmentation Removal: ఎన్ని ప్రయత్నాలు చేసిన డార్క్ స్పాట్స్‌ తగ్గడం లేదా? ఇలా 20 రోజుల్లో చెక్‌ పెట్టండి!

Pigmentation Removal: డార్క్ స్పాట్స్‌ సమస్యలతో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా ఈ ఫేస్‌ ఫ్యాక్‌లను వినియోగించడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల చర్మ సమస్యలను తగ్గిస్తాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 21, 2023, 12:36 PM IST
Pigmentation Removal: ఎన్ని ప్రయత్నాలు చేసిన డార్క్ స్పాట్స్‌ తగ్గడం లేదా? ఇలా 20 రోజుల్లో చెక్‌ పెట్టండి!

Pigmentation Removal: ప్రస్తుతం శరీరంలో పోషకాల లోపం వల్ల, వాతావరణంలో కాలుష్యం పెరగడం కారణంగా డార్క్ స్పాట్స్ సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు కేవలం వృద్ధాప్యంలో మాత్రమే వచ్చేవి, కానీ ప్రస్తుతం చిన్న వయసులో ఉన్నవారికి కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. చిన్న వయసులో చర్మంపై మెలనిన్ అధికంగా పేరుకుపోవడం వల్ల మచ్చలుగా ఏర్పడుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆయుర్వేద గుణాలు కలిగిన ఫేస్ ప్యాక్‌లు కూడా వినియోగించాల్సి ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా వాడడం వల్ల డార్క్ స్పాట్స్‌ సమస్యలు సులభంగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఫేస్ ప్యాక్‌లు ముఖంలోని మచ్చలను తొలగించి..చర్మాన్ని మెరుగుపరడానికి సహాయపడుతుంది. 

ఈ ఫేస్ ప్యాక్‌తో డార్క్ స్పాట్స్‌ మాయం: 
బొప్పాయి ఫేస్ ప్యాక్:

బొప్పాయిలో పపైన్ అనే సహజ ఎంజైమ్ ఉంటుంది. కాబట్టి దీనితో తయారు చేసిన ఫేస్ ప్యాక్ వినియోగించడం వల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోయి. డార్క్ స్పాట్స్‌ సులభంగా దూరమవుతాయని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఫేస్‌ ఫ్యాక్‌ తయారు చేయడానికి.. అర చెంచా బొప్పాయి గుజ్జులో 4 చెంచాల పచ్చి పాలను మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. దీనిని డార్క్ స్పాట్స్‌ ప్రభావిత ప్రదేశంలో అప్లై చేసి 20 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది. 

Also Read: Bhuma Akhila Priya Reddy: భూమా అఖిలప్రియకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు  

ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్:
ముల్తానీ మిట్టి ముఖ సౌందర్యాన్ని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే గుణాలు చర్మ సంరక్షించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా ముల్తానీ మిట్టిలో తేనె కలిపి ఫేస్ ప్యాక్ తయారు ముఖానికి అప్లై చేస్తే డార్క్ స్పాట్స్‌ కూడా సులభంగా దూరమవుతాయి. ఫేస్ ప్యాక్ చేయడానికి..4 టీస్పూన్ల ముల్తానీ మిట్టిలో అర టీస్పూన్ తేనె,  2 టీస్పూన్ల రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ తయారు చేయండి. ఇలా తయారు చేసిన ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి  20 నుంచి 25 నిమిషాల పాటు ఉంచి శుభ్రం చేయాలి. 

ఆరెంజ్ పీల్ ఫేస్ మాస్క్:
ఆరెంజ్ పీల్ మాస్క్‌ కూడా డార్క్ స్పాట్స్‌ నుంచి ఉపశమనం కలిగించడానికి కూడా సహాయపడుతుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో పెసర పప్పును వినియోగించడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఫేస్‌ ఫ్యాక్‌ను తయారు చేయడానికి ముందుగా 2 చెంచాల నారింజ తొక్క పొడి తీసుకోవాల్సి ఉంటుంది. అందులో రెండు చెంచాల పెసర పప్పు వేసి నీటిని కలిపి మిశ్రమంలా తయారు చేయాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 25 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల డార్క్ స్పాట్స్‌ దూరమవుతాయని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. 

Also Read: Bhuma Akhila Priya Reddy: భూమా అఖిలప్రియకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News