Premature White Hair: ప్రస్తుతం చాలా మందిలో చిన్నవయసుల్లో తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. తెల్ల జుట్టు కారణంగా మానసిక సమస్యల బారిన కూడా పడుతున్నారు. తెల్ల జుట్టు కారణంగా ముఖంగా అందహీనంగా కూడా తయారవుతుంది. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి పలు రసాయనాలతో కూడిన రంగులను వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల తీవ్ర దుష్ర్పభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
తెల్ల జుట్టు చాలా మందిలో అనేక వ్యాధుల ప్రభావం వల్ల కూడా వస్తోందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్ వినియోగించనవసరం లేదు. సౌందర్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలు పాటిస్తే సులభంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అయితే ఎలాంటి చిట్కాలు పాటిస్తే సులభంగా ఉపశమనం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత
తెల్ల జుట్టును నల్లగా చేసేందుకు మస్టర్డ్ ఆయిల్లో పాటు అలోవెరా జెల్‌ను వినియోగించడం వల్ల తెల్ల జుట్టు సులభంగా నల్లగా మారుతుందని నిపుణులు తెలుపుతున్నారు. ఈ పదార్థాలను వినియోగించి తయారు చేసిన నూనెను వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు.
మ్యాజికల్ ఆయిల్ తయారి పద్ధతి:
ముందుగా ఒక గ్లాసు నీళ్ళు మరిగించి.. ఇందులోనే కరివేపాకు వేసి, కలబంద ముక్కను వేసి, ఒక చెంచా అవిసె గింజలతో పాటు నల్ల జీలకర్ర, సోపు గింజలను బాగా మరిగించాలి. ఆ తర్వాత ఒక కప్పు ఆవాల నూనె వేసి మరోసారి మరిగించాలి. పై పేర్కొన్న వాటిని బాగా మరిగించి మిశ్రమంలా తయారు చేసి నూనెలో వేసుకుని మరిగించుకోవాలి. ఇలా నూనెలో వేసిన తర్వాత మిశ్రమంలా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook