Hair Fall: జుట్టు రాలడాన్ని తగ్గించే ఆసనాలు ఇవే! రోజు ఇలా చేయండి చాలు..హెయిర్ ఫాల్ తగ్గడం ఖాయం!

Hair Fall Control Yoga: ప్రస్తుతం చాలామందిలో జుట్టు రాలడం కారణంగా ముఖం అందహీనంగా తయారవుతుంది. అయితే ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ రెండు ఆసనాలను ప్రతిరోజు వేస్తే జుట్టు రాలడం సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 6, 2023, 07:55 PM IST
Hair Fall: జుట్టు రాలడాన్ని తగ్గించే ఆసనాలు ఇవే! రోజు ఇలా చేయండి చాలు..హెయిర్ ఫాల్ తగ్గడం ఖాయం!

 

Hair Fall Control Yoga: వాతావరణంలో మార్పుల కారణంగా జుట్టు పొడిగా మారుతోంది. కారణంగా చివరికి జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. జుట్టు రాలడం వల్ల బట్టతల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం జుట్టు రాలడం సమస్యలతో బాధపడేవారు మార్కెట్లో ఖరీదైన షాంపులను వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారని వారు చెబుతున్నారు. 

ప్రస్తుతం చాలామందిలో జుట్టు రాలడం సమస్య పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పొడి జుట్టు, అన్ని జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు విటమిన్ సి అధిక పరిమాణంలో ఉండే ఆహారాలను ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ యోగాసనాలను వేయడం వల్ల కూడా జుట్టు రాలడానికి సమస్యలను తగ్గించుకోవచ్చు. ఏయే యోగాసనాలు వేయడం వల్ల సులభంగా జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Also read: Post Office Schemes: రోజుకు 50 రూపాయలు పెట్టుబడి చాలు, 35 లక్షలు సంపాదించే అవకాశం

పర్వతాసనం:
ప్రతిరోజు ఉదయం పూట పర్వతాసనం వెయ్యడం వల్ల పొందుతారు. జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఆసనాన్ని ప్రతిరోజు ఉదయం పూట మూడు నుంచి నాలుగు సార్లు వేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ ఆసనం వేయడం వల్ల శరీరం కూడా దృఢంగా తయారవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా ప్రతిరోజు ఈ ఆసనం వేయడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుంది.

ససంగాసనం:
ఈ ఆసనం కుందేలాకారంలో ఉంటుంది. ఆసనాన్ని వెయ్యడానికి ముందుగా మోకాళ్లపై కూర్చుని ముఖాన్ని భూమికి ఆనించాలి. ఆ తర్వాత శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా బయటకు వదలాలి. ప్రతిరోజు 5 నుంచి 6 సార్లు చేస్తే జుట్టు సమస్యలన్నీ సులభంగా నయమవుతాయి. అంతేకాకుండా నడుము నొప్పి సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తరచుగా నొప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఈ ఆసనాన్ని వేయాల్సి ఉంటుంది.

Also read: Post Office Schemes: రోజుకు 50 రూపాయలు పెట్టుబడి చాలు, 35 లక్షలు సంపాదించే అవకాశం

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News