Apple iPhone: రూ. 17 వేలకే యాపిల్ ఐఫోన్

Apple iPhone 12 Mini Best Price on Flipkart Sale: ఒకవేళ మీరు చిన్న సైజ్ యాపిల్ ఫోన్ కోసమే చూస్తున్న వాళ్లు అయితే, యాపిల్ ఐఫోన్ 12 మినీని మిస్ చేసుకోకుండా సొంతం చేసుకునేందుకు ఇదే రైట్ ఆపర్చునిటీ. ఉపయోగించడానికైనా.. జేబులో క్యారీ చేయడానికైనా ఎంతో సౌకర్యంగా ఉండే ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ఇదిగో ఈ డీటేల్స్ మీ కోసమే.

Written by - Pavan | Last Updated : Jun 8, 2023, 12:12 AM IST
Apple iPhone: రూ. 17 వేలకే యాపిల్ ఐఫోన్

Apple iPhone 12 Mini Best Price on Flipkart Sale: యాపిల్ ఐఫోన్ 13 సిరీస్, యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ రావడంతో యాపిల్ ఐఫోన్ 12 మిని ఇప్పటికే గత చరిత్రలో కలిసిపోయింది. కొత్త సిరీస్ రాకతో మార్కెట్ లో కనిపించకుండా పోయిన స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ నుండి కూడా క్రమక్రమంగా కనిపించకుండా పోతోంది. అందుకే ఒకవేళ మీరు చిన్న సైజ్ యాపిల్ ఫోన్ కోసమే చూస్తున్న వాళ్లు అయితే, యాపిల్ ఐఫోన్ 12 మినీని మిస్ చేసుకోకుండా సొంతం చేసుకునేందుకు ఇదే రైట్ ఆపర్చునిటీ. ఉపయోగించడానికైనా.. జేబులో క్యారీ చేయడానికైనా ఎంతో సౌకర్యంగా ఉండే ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ఇదిగో ఈ డీటేల్స్ మీ కోసమే.

యాపిల్ ఐఫోన్ 12 మినీ లాంచింగ్ ధర రూ. 69,900 కాగా.. యాపిల్ ఐఫోన్ 12 కంటే ఇది దాదాపు రూ. 10,000 చౌక అయినది కావడం మరో విశేషం. అందుకే యాపిల్ ఐఫోన్ 12 మిని లాంచ్ అయిన కొత్తలో యాపిల్ ఐఫోన్ కొనాలని కలలు కన్న చాలామంది యాపిల్ ఐఫోన్ 12 మిని కొనేసి తమ కలను నిజం చేసుకున్నారు. 

ఇదిలావుంటే, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ యాపిల్ ఐఫోన్ 12 మిని ఫోన్ రూ. 42,901 డిస్కౌంట్ అనంతరం కేవలం రూ. 16,999 కే లభిస్తోంది. అవును మీరు చదివింది నిజమే.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ ఐఫోన్ 12 మినిపై రూ. 8,901 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ డిస్కౌంట్ అనంతరం ఈ ఫోన్ ఖరీదు రూ.50,999 గా ఉండగా.. అదనంగా రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో  హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఇఎంఐ విధానంలో కొనుగోలు చేసే వారికి మరో రూ. 4,000 మేరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ రెండు రకాల డిస్కౌంట్స్ తీసేసిన తరువాత యాపిల్ ఐఫోన్ 12 మిని ఫోన్ ధర రూ.46,999 కి తగ్గింది. 

అంతేకాకుండా, కొనుగోలుదారులు కండిషన్‌లో ఉన్న తమ పాత స్మార్ట్‌ఫోన్‌‌ని ఎక్స్‌చేంజ్ చేసుకుంటే... అందుకు బదులుగా రూ. 30,000 వరకు మరొక డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. ఇలా అన్నిరకాల డిస్కౌంట్స్ కలిపి రూ. 42,901 తగ్గించిన తర్వాత రూ. 69,900 విలువ చేసే యాపిల్ ఐఫోన్ 12 మిని ఐఫోన్ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ. 16,999కి లభిస్తోంది.

Trending News