Ponguleti Srinivas Reddy On BRS: అధికార మదంతో ఉన్న ప్రజా ప్రతినిధులు అవాకులు చెవాకులు పేలుతున్నారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మంలో జరిగిన ముఖ్య కార్యకర్తల మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. మీ నాయకుడికి జెండా లేదు.. అజెండా లేదు అని ఎగతాళిగా మాట్లాడారని.. మీ సొల్లు కబుర్లు, సొంత డబ్బాలు కొట్టుకునే మీ ట్రాప్‌లో మేము పడమని అన్నారు. ఒక పార్టీలోకి తాను వెళ్తున్నానని మీడియాలో చెప్పగానే.. బీఆర్ఎస్ నాయకులు పార్టీ చేసుకొని మందు బాటిళ్లు తెళ్ళార్లు తాగారని అన్నారు. వారం రోజుల నుంచి మాత్రం ఏమి తాగకున్నా.. మీకు మళ్లీ గెలిచే అవకాశం వస్తుందో లేదో అని మీకు నిద్ర పట్టడం లేదన్నారు. కొంతమందికి కళ్లున్నా.. కనబడని ధృతరాష్ట్ర పాలకులు ఉన్నారని అన్నారు.
"వంశ చరిత్ర అని చాలా మాటలు మాట్లాడుతున్నారు. నా చిరునవ్వే.. నీ రాజకీయ సమాధికి సమాధానం అవుతుంది.. నేను ఒక్క మాట కూడా నీ గురించి మాట్లాడను..
ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేస్తే.. పాలతో శుద్ధి చేయిస్తావా.. అదేనా నీ సంస్కృతి.. ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు.. గత ఐదు నెలలుగా ప్రజలు ఇచ్చిన స్ఫూర్తితో నేను నడుస్తున్నా.. రాష్ట్ర ప్రజల అందరి దృష్టి ఖమ్మం జిల్లా మీద ఉంది.. అది మీరు ఇచ్చిన ధైర్యమే.. పార్టీ, కుల, మతాలకు అతీతంగా అందరూ నన్ను ఆదరిస్తున్నారు. అoదరం కలిసి యుద్ధం చేద్దాం..
నాకు పదవి కావాలంటే.. 2019లో నాకు తండ్రి సమనుడిగా భావించిన వ్యక్తి టికెట్ ఇవ్వనపుడు నాడే నేను పార్లమెంట్ సభ్యుడిగా నిలబడి ఉంటే పదవి అపుడే వచ్చేది. నాకు ప్రజా సేవే ముఖ్యం. పదవి కాదు.. మీ అండతో ఎంత పెద్ద కొండను అయినా నేను ఢీ కొడతా.. జరిగిన నష్టానికి వడ్డీతో సహా లాక్కుని తీసుకునే సమయం వచ్చింది. మీ అందరి మదిలో ఏముందో నాకు అర్థమైంది. సమయం కోసం వెయిట్ చేస్తున్నా.. మీ అందరి అభిప్రాయాన్ని పరిశీలించి మూడు.. నాలుగు రోజుల్లో అందరికీ చెబుతా..
నిర్ణయం నా మదిలో ఉన్నా.. ఇప్పుడే ప్రకటించలేకపోతున్నా.. రాష్ట్ర రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ఇపుడు చెప్పట్లేదు.. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ నుంచి ప్రజలకు విముక్తి రావాలంటే రాష్ట్ర మొత్తం మనలాంటి ఆలోచన ఉన్న వ్యక్తులని సమీకరించల్సిన అవసరం ఉంది. రహస్య ప్రాంతాల్లో ఇప్పటివరకు అర్ధరాత్రి వరకు ఇతర నేతలతో చర్చలు జరిపి మాట్లాడి ఏకం చేస్తున్నా.. హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టీ మూడు నాలుగు రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తా.. ఎక్కడో కాదు.. ఖమ్మం నడి బొడ్డున కనీవినీ ఎరుగని రీతిలో బహిరంగ సభ పెట్టీ ఖమ్మంలో బహిరంగ సభ పెడతాం.. జాతీయ పార్టీ పెట్టుకున్నామని ఎవరో ఖమ్మంలో మీటింగ్ పెట్టి జబ్బలు చరుచుకున్న వారి కంటే గొప్పగా మన మీటింగ్ ఉంటుంది..
బీఆర్ఎస్ పార్టీని.. కేసీఆర్‌ను పాతి పెడతాం.. కల్లబొల్లి మాటలు కాదు.. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన ప్రతి మాట పూర్తి చేస్తాం.. ఢిల్లీలో ముఖ్య నాయకులతో మాట్లాడి బహిరంగ సభ తేదీ ప్రకటిస్తానని చెబుతున్నా.. నన్ను కూడా నా స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారు.. ఇంకా ఒకటి, రెండు నెలలు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడతారు. మీరు పెట్టే ఇబ్బందులు.. నా వెంట్రుకతో సమానం.." అని పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read: RBI Repo Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ.. రెపో రేటుపై కీలక ప్రకటన
Also Read: Anantha Movie Review: అనంత మూవీ రివ్యూ.. సరికొత్త స్టోరీ లైన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి