Jabardasth Artist Hari in Smuggling case: జబర్ధస్త్ షో కమెడియన్ హరి మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. సుమారు 60 లక్షలు విలువచేసే A1 క్వాలిటీ ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తూ హరి అడ్డంగా దొరికిపోయాడని తెలుస్తోంది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నెక్కుంది పంచాయితీ మురుంపల్లి వద్ద స్కార్పియో, వేగనార్ వాహనాల్లో ఎర్రచందనం దుంగలను దొంగలు స్మగ్లింగ్ చేస్తుండగా.. అదే సమయంలో పోలీసులు గస్తీ కాస్తూ అటువైపుగా వెళ్లారు. అయితే, పోలీసులను చూసిన దొంగలు.. అక్కడి నుంచి పరారయ్యారు. డ్రైవర్ కిషోర్ మాత్రం పోలీసులకు పట్టుపడ్డాడు.
పట్టుబడిన డ్రైవర్ కిషోర్ ని అరెస్ట్ చేసి ఈ స్మగ్నింగ్ ముఠా ఎవ్వరిది, ఎక్కడి నుంచి వచ్చినట్టు అని ఆరా తీయగా.. ఈ స్మగ్లింగ్ ముఠా వెనుక జబర్దస్త్ కమెడియన్ హరి ప్రధాన పాత్ర పోషించినట్లు పోలీసులకు తెలిసింది. ఈ మేరకు పలమనేరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి ఆ వివరాలను మీడియాకు తెలిపారు.
పలమనేరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ.. జబర్దస్త్ కమెడియన్ హరిపై గతంలోనూ పలు కేసులు నమోదు అయినట్టు తెలిపారు. తిరుపతి, కాణిపాకం పోలీస్ స్టేషన్లలో హరిపై కేసులు నమోదయ్యాయి అని అన్నారు. ఈ ఎర్రచందనం దుంగలను నిందితులు ఏపీ నుంచి కర్ణాటకకు తరలించి.. అక్కడి నుంచి బెంగుళూరు, కడిగనహళ్లి కి తరలిస్తున్నారని.. అనంతరం అక్కడి నుండి విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని పలమనేరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు డిఎస్పి తెలిపారు.
ఇది కూడా చదవండి : Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ డ్రెస్సును ఎత్తిపట్టుకున్నాడు
ఇది కూడా చదవండి : Urfi Javed's Pizza Top: పిజ్జా అడ్డం పెట్టుకుని అర్ధనగ్నంగా డాన్స్.. ఎవరైనా తింటే పరిస్థితి ఏంటి ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK