Honey Trap Viral News: సోషల్ మీడియా పెరిగిపోవడం కారణంగా చాలా కొత్త కొత్త మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. సోషల్ మీడియా సాధనాలను వినియోగించుకుని అమ్మాయిలు ప్రేమ పేరుతో హనీ ట్రాప్‌లు చేస్తున్న వార్తాలు తరచుగా వింటూనే ఉన్నాం. దీనికి తోడు కొత్తగా ఓటీపీ చెప్పమని బ్యాంక్‌లో డబ్బులు లూటీ చేయడం. ల్యాటరీ మోసాలు కూడా విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అయితే ఇటీవలే దీనికి మించి మోసం మరొకటి వెలుగులోకి వచ్చింది. ఈ కొత్త మోసం ఏంటో దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పూర్తి వివరాలకు వెళితే..ఇటీవలే ఓ అమ్మాయి అబ్బాయిలా యాక్టిగ్ చేస్తూ ఫేస్‌బుక్‌లో రీల్‌ను షేర్ చేస్తూ ఉండేది. అయితే ఇదే క్రమంలో ఈ అమ్మాయి గురుగ్రామ్ చెందిన ఇంకో అమ్మాయికి పరిచయమై ట్రాప్ చేసింది. వీరు ఇద్దరు ఒకరికొకరు నచ్చి..ఇంట్లో నుంచి పరారు అవుతారు. ఇలా పారిపోయిన వీరిద్దారు యూపీలో కలుపుకుంటారు. ఆ తర్వార వీరు ఒకరికొకరు నచ్చడంతో ముంబైలోని ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు.
Also Read: Weather Updates: భారీ ఎండల నుంచి ఉపశమనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు
ఇంతలోనే గురుగ్రామ్ అమ్మాయికి నిజం తెలిసిపోతుంది. తను చేసుకున్న భాగస్వామి అబ్బాయి కాదని అమ్మాయని..వీరిద్దరు మైనర్లేనని చాప్రాలోని ఎక్మా పోలీస్‌లకు గురుగ్రామ్ అమ్మాయి తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో కథ అంతా అడ్డం తిరిగింది. పోలీసు రంగంలోకి దిగి ఛప్రాకు చెందిన అమ్మాయే అబ్బాయిలా యాక్టింగ్ చేసి ఫేస్ బుక్‌లో రీల్స్ పోస్ట్ చేసిన వీడియోలను గుర్తించారిని పోలీసులు పేర్కొన్నారు. వీరిద్దరు మైనర్లు కావడంతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పారు.
ఫుల్ స్టోరీ ఇదే:
ఛప్రాకు చెందిన ఓ యువతి సోషల్ మీడియాలో అబ్బాయిలాగా ఫేస్‌బుక్ అకౌంట్ రన్ చేస్తూ..గురుగ్రామ్ అమ్మాయిని ట్రాప్‌లోపి దింపింది. ఇలా వీరు ఇద్దరు మూడు నుంచి నాలుగు నెలల పాటు ఇద్దరు మాట్లాడుకి..చివరికి లవ్ చేసుకున్నారు. వీరు ఒక్కటవ్వాలనే కోరికతో జూన్ 2న ఇద్దరూ పరిపోయారు. ఆ తర్వాత జూన్ 4న పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి వివాహం జరిగిన తర్వాత ఛప్రాకు చెందిన అమ్మాయి ముంబైలో 15 రోజుల పాటు ఓ కంపెనీలో పని చేసింది. అయితే హనీమూన్ రోజు అసలు విషయం బయట పడింది. ఇది తెలుసుకున్న ఛప్రాకు చెందిన అమ్మాయి ఒక్కసారిగా షాక్‌కి గురైంది.
Also Read: Weather Updates: భారీ ఎండల నుంచి ఉపశమనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook