YS Sharmila joins in Congress: ముగిసిన వైఎస్ షర్మిల కథ.. కాంగ్రెస్‌లో చేరిక అంటూ జోరుగా ప్రచారం

Congress-YSRTP Alliance: కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌టీపీ విలీన వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరికకు దాదాపు ముహూర్తం ఖరారు అయిందని ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో చర్చలు మొదలయ్యాయని వార్తలు వస్తున్నాయి.   

Written by - Ashok Krindinti | Last Updated : Jun 24, 2023, 10:46 AM IST
YS Sharmila joins in Congress: ముగిసిన వైఎస్ షర్మిల కథ.. కాంగ్రెస్‌లో చేరిక అంటూ జోరుగా ప్రచారం

Congress-YSRTP Alliance: వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని ఊహగానాలు వినిపిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన అనంతరం డీకే శివకుమార్‌తో రెండుసార్లు భేటీ కావడంతో ప్రచారానికి బీజం పడింది. ఇటీవల రాహుల్ గాంధీ బర్త్ డే సందర్భంగా వైఎస్ షర్మిల ట్వీట్‌తో మరింత బలం చేకూరింది. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణలో బాధ్యతలు నిర్వహించేందుకు డీకే శివకుమార్ రానుండడంతో షర్మిల కాంగ్రెస్‌లోకి రావడం ఖాయమని కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కలిసి వైఎస్‌ఆర్‌టీపీ ముఖ్య నాయకులు చర్చించినట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన తిరిగి వచ్చిన తరువాత ఈ విషయంపై మాట్లాడతామని ఆయన చెప్పినట్లు సమాచారం. షర్మిల చేరిక అంశంపై ఏఐసీసీ, టీపీసీసీ నాయకుల మధ్య కూడా చర్చలు జరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. షర్మిల చేరికపై అభ్యంతరం లేదని చెబుతున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు.. ఆమెకు ఏపీ బాధ్యతలు అప్పగించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పార్టీ పూర్తిగా పడిపోయిందని.. షర్మిలకు అప్పగిస్తే కొంచెం పుంజుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఎన్నికల్లో కాంగ్రెస్-వైఎస్ఆర్‌టీపీ మధ్య అవగాహన ఒప్పందం మాత్రమే ఉంటుందని కొందరు అంటున్నారు. 

Also Read: AP Weather Updates: ఏపీకి రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాలో భారీ వర్షాలు

కాగా.. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనంపై షర్మిల గతంలోనే క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్‌లో విలీనం చేయాలని అనుకుంటే.. తాను పార్టీ ఎందుకు పెడతానని ప్రశ్నించారు. తాను తెలంగాణ కోసమే పార్టీ పెట్టానని చెప్పాఉ. 2014, 2018 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిన సీట్లను నిలబెట్టుకోలేదన్నారు. కాంగ్రెస్‌లో నాయకత్వ లోపంతోనే నేతలను నిలబెట్టుకోలేకపోతున్నారని.. సరైన లీడర్‌షిప్ లేకనే పక్క పార్టీ నుంచి లీడర్లను తీసుకువస్తున్నారని అన్నారు. 

గతంలో ఎన్నడూ రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా వైఎస్ షర్మిల విష్‌ చేయలేదు. ఇటీవల అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేయడం చర్చకు దారి తీసింది. కాంగ్రెస్-వైఎస్ఆర్‌టీపీ కలయికపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.  

Also Read: Adipurush Collections: ఆదిపురుష్‌ కలెక్షన్లకు మేకర్స్ తిప్పలు.. 3D టిక్కెట్ రేట్లు తగ్గింపు.. కానీ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x