O Saathiya Movie: 'ఓ సాథియా' రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. పాన్‌ ఇండియా లెవల్లో భారీగా విడుదల

O Saathiya Movie Release Date: ఓ సాథియా మూవీ విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. జూలై 7న పాన్ ఇండియాస్థాయిలో మూవీ మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం ప్రమోషన్ కార్యాక్రమాల్లో మూవీ టీమ్ బిజీగా ఉంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 22, 2023, 04:54 PM IST
O Saathiya Movie: 'ఓ సాథియా' రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. పాన్‌ ఇండియా లెవల్లో భారీగా విడుదల

O Saathiya Movie Release Date: ఆర్యన్‌గౌరా, మిస్టీ చక్రవర్తి జంటగా నటించిన మూవీ ఓ సాథియా. ఈ సినిమా ద్వారా దివ్య భావన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. సరికొత్త ప్రేమకథతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించినట్లు మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా లవ్‌స్టోరీని పరిచయం చేస్తున్నామని అంటున్నారు. తన్వికా–జశ్వికా క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కిన ఈ మూవీని చందన కట్టా, సుభాష్‌ కట్టా నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. జూలై 7వ తేదీన పాన్ ఇండియా వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు.

ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ సుభాష్‌ మాట్లాడుతూ.. చిన్న మూవీ అయినా.. పెద్ద బ్యాక్‌అప్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నామని తెలిపారు. ఇందుకు ప్రధాన కారణం యూఎఫ్‌ఓ మూవీస్ సంస్థ  ఏపీ, తెలంగాణ వైస్‌ ప్రెసిడెంట్‌  జి.లక్ష్మణ్‌ అని తెలిపారు. "లక్ష్మణ్‌ గారు ఓ సాథియా సినిమాను చూశారు. హీరోహీరోయిన్ బాగా నటించారని.. సినిమా డైరెక్షన్ బాగుందని మెచ్చుకున్నారు. ఈ సినిమాకు సాంగ్స్ బ్యాక్ బోన్ అని చెప్పారు. మూవీ నచ్చడంతో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు సపోర్ట్ చేస్తామని ఆయన ముందుకొచ్చారు.. ఆయన సహకారంతోనే భారీగా రిలీజ్ చేస్తున్నాం.." సుభాష్ వెల్లడించారు. 

తమ సినిమాకు కంటెంట్ బలమని నిర్మాత సుభాష్ తెలిపారు. ఓ సాథియా మూవీని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నందుకు యూఎఫ్‌ఓ మూవీస్‌కు ప్రత్యేంగా ధన్యవాదాలు చెప్పారు. ఈ సినిమాకు సంగీతం విన్నూ అందించగా.. డీఓపీ బాధ్యతలను ఈజే వేణు నిర్వర్తించారు. ఎడిటర్‌గా కార్తీక్‌ కట్స్ వ్యవహరించారు. భాస్కరభట్ల, అనంత శ్రీరామ్, రాంబాబు గోసాల లిరిక్స్‌ అందించారు. కొరియోగ్రాఫర్స్‌గా రఘు, బాబా భాస్కర్‌ వ్యవహరించారు.

Also Read: Maa Awara Zindagi: బిగ్‌బాస్ శ్రీహాన్ 'మా ఆవారా జిందగీ' వచ్చేస్తోంది.. రిలీజ్ ఎప్పుడంటే..?  

Also Read: Bandi Sanjay: సింగిల్‌గానే పోటీ చేస్తాం.. జనసేనతో పొత్తుపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News