Batsman Collides with Football Goal Post: ఆడుతుంది క్రికెట్.. వెళ్లి ఫుట్ బాల్ గోల్ పోస్టుని డీ కొట్టాడు.. తరువాత ఏం జరిగిందంటే..?

Batsman Collides With Football Goal Post: "క్రికెట్లో పరుగు తీస్తూ ఫుట్ బాల్ గోల్ పోస్టుని ఢీకొట్టాడు" అనే టైటిల్ చూసి కన్‌ఫ్యూజ్ అవుతున్నారా ? అయినా క్రికెట్లో ఫుట్ బాల్ గోల్ పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అని అయోమయానికి గురవుతున్నారా ? అయితే, మీ గందరగోళం పోవాలంటే ఈ ఘటనకు సంబంధించిన ఫుల్ డీటేల్స్ తెలుసుకోవాల్సిందే.

Written by - Pavan | Last Updated : Jun 26, 2023, 05:40 PM IST
Batsman Collides with Football Goal Post: ఆడుతుంది క్రికెట్.. వెళ్లి ఫుట్ బాల్ గోల్ పోస్టుని డీ కొట్టాడు.. తరువాత ఏం జరిగిందంటే..?

Batsman Collides With Football Goal Post: "క్రికెట్లో పరుగు తీస్తూ ఫుట్ బాల్ గోల్ పోస్టుని ఢీకొట్టాడు" అనే టైటిల్ చూసి కన్‌ఫ్యూజ్ అవుతున్నారా ? అయినా క్రికెట్లో ఫుట్ బాల్ గోల్ పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ? ఎందుకు వచ్చింది అని అయోమయానికి గురవుతున్నారా ? అయితే, మీ గందరగోళం పోవాలంటే ఈ ఘటనకు సంబంధించిన ఫుల్ డీటేల్స్ తెలుసుకోవాల్సిందే. మనిషి జీవితంలో క్రికెట్ తో ఒక విడదీయలేని అనుబంధం ఏర్పడింది అనే విషయం అందరికీ తెలిసిందే. 

మరీ ముఖ్యంగా మన దేశంలో క్రికెట్ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కడో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌ని టీవీల్లో క్రికెట్ చూసేటప్పుడే అందులో పూర్తిగా ఇన్‌వాల్వ్ అయి మనమే పిచ్‌లో ఉన్నామా అన్నంత ఎక్కువగా ఫీల్ అవుతుంటాం. ఒకవేళ మన చేతుల్లోనే బ్యాట్, బాల్ ఉందంటే ఇక ఒళ్లు మర్చిపోయి మరీ వీరలెవెల్లో ఆడేస్తుంటాం. క్రికెట్ ని ఇంకా బాగా ఫీల్ అయ్యే వాళ్లు ఏకంగా చుట్టూ ఉన్న పరిసరాలను కూడా మర్చిపోయి మరీ ఆ ఆటలో లీనమైపోతారు. అప్పుడు వాళ్లకు తమ ముందున్న లక్ష్యమే తప్ప ఇంకేమీ కనిపించదు.. ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో కూడా అలాంటి దృశ్యమే చోటుచేసుకుంది. 

ఆదివారం వచ్చిందంటే చాలు ఒక్క జట్టు ఆడాల్సిన క్రికెట్ మైదానంలో ఐదారు జట్లు క్రికెట్ ఆడటం చూస్తుంటాం.. ఆటడానికి స్థలం లేకపోవడం వల్ల ఉన్న స్థలంలోనే ఎవరికి వారే అన్నట్టుదా నాలుగైదు జట్లు క్రికెట్ ఆడుతుంటాయి. క్రికెట్ గ్రౌండా లేక ఫుట్ బాల్ గ్రౌండా అనే విషయం కూడా పట్టించుకోరు.. తాము ఆడటానికి స్థలం ఉందా లేదా అనేదే చూస్తారు. అలా ఫుట్ బాల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒక బ్యాట్స్‌మన్‌కి ఎదురైన చేదు అనుభవం ఇది. 

ఇది కూడా చదవండి : viral news: ఈ బుడ్డోడి టైమ్ టేబుల్ చూస్తే.. మీ బాల్యం గుర్తుకు రావడం పక్కా

లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ బ్యాటింగ్ చేస్తుండగా.. మొత్తం మీదకే వచ్చిన బంతిని నిల్చున్న చోటు నుంచే ముందుకు కదిలి లెగ్ సైడ్‌లో షాట్ కొట్టాడు. ఆ బంతి వెళ్లిన వైపు చూస్తూ పరుగు కోసం రన్నింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో తాను ఏ దిశలో పరుగు పెడుతున్నాడో కూడా చూసుకోలేదు. అప్పుడు ఆ ఆటగాడి దృష్టి మొత్తం బంతిపైనే ఉంది. అలా ముందుకు చూసుకోకుండా పరుగెత్తే క్రమంలోనే ఆ ఆటగాడు అక్కడే ఉన్న ఫుట్ బాల్ గోల్ పోస్టుని ఢీకొన్నాడు. అతడు ఎంత వేగంగా ఢీకొన్నాడంటే.. ఆ దెబ్బకు అదే గోల్ పోస్టును సపోర్టుగా పట్టుకుని కిందపడిపోయాడు. బ్యాట్స్‌మన్ గోల్ పోస్టుని ఢీకొని కుప్పకూలడం చూసిన తోటి ఆటగాళ్లంతా అక్కడికి చేరుకుని అతడికి సహాయం చేసే పనిలో బిజీ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి : Beautiful Beaches In India: ఇండియాలో ఎప్పటికైనా సరే చూసి తీరాల్సిన బ్యూటీఫుల్ బీచ్‌లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News