/telugu/photo-gallery/2024-karthika-pournami-wishes-for-your-family-and-friends-with-hd-photos-beautiful-messages-sd-180865 2024 Karthika Pournami Wishes: మీ  కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 2024 Karthika Pournami Wishes: మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 180865

July Bank Holidays: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా బ్యాంకు సెలవులు జాబితా విడుదల చేస్తుంటుంది. ఇందులో రెండవ, నాలుగవ శనివారాలు, ఆదివారాలు కాకుండా ఇతర సెలవులుంటే అన్నీ స్పష్టంగా వివరంగా ఉంటాయి. మరి జూలై నెలలో బ్యాంకు సెలవులేమున్నాయో చూద్దాం..

ప్రతి నెలా ఏ రోజు బ్యాంకులకు సెలవుందో తెలుసుకుంటే అందుకు అనుగుణంగా బ్యాంకు పనులు ప్లాన్ చేసుకోవచ్చు. లేకపోతే సమయం, ఎనర్జీ రెండూ వృధా అవడమే కాకుండా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. జూలై నెల మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఆర్బీఐ విడుదల చేసిన జాబితా ప్రకారం జూలైలో 14 రోజులు బ్యాంకులు పనిచేయవు. ఈ 14 రోజుల్లోనే 5 ఆదివారాలు, రెండవ, నాలుగవ శనివారాలున్నాయి. అంటే మొత్తం 7 రోజులు శని, ఆదివారాలే ఉన్నాయి. 

మిగిలిన రోజుకు కొన్ని జాతీయమైతే కొన్ని ప్రాంతీయ సెలవులు. అంటే కొన్ని రాష్ట్రాల్లోనే ఆయా సెలవులుంటాయి. మొహర్రం మాత్రం జాతీయ సెలవుగా ఉంది. మిగిలినవి ప్రాంతీయ సెలవులే. అంటే చాలా రాష్ట్రాల్లో సెలవులు ఉండకపోవచ్చు. 

జూలై 2                          ఆదివారం సెలవు
జూలై 5                          గురు గోవింద్ జయంతి-జమ్ము, శ్రీనగర్‌లో సెలవు
జూలై 6                          మిజోరాంలో ఎంహెచ్ఐపీ సెలవు
జూలై 8                          రెండవ శనివారం
జూలై 9                          ఆదివారం
జూలై 11                        త్రిపురలో కేరా పూజా సందర్భంగా సెలవు
జూలై 13                        సిక్కింలో భాను జయంతి సెలవు
జూలై 16                        ఆదివారం
జూలై 17                        మేఘాలయలో యూ తిరోట్ సింగ్ డే
జూలై 22                        నాలుగవ శనివారం
జూలై 23                        ఆదివారం
జూలై 29                        మొహర్రం
జూలై 30                        ఆదివారం
జూలై 31                        షహాదత్ సెలవు జమ్ము కాశ్మీర్ 

తరచూ బ్యాంకు పనులుండేవాళ్లు ఆర్బీఐ విడుదల చేసే బ్యాంకు సెలవుల్ని బట్టి తమ తమ పనులు ప్లాన్ చేసుకుంటే ఏ విధమైన ఇబ్బందులు ఎదురుకావు. జూలై బ్యాంకు సెలవుల జాబితాను బట్టి జూలైలో ఏయే రోజులు సెలవులో తెలుసుకుంటే అందుకు అనుగుణంగా బ్యాంకు పనుల్ని ప్లాన్ చేసుకోవచ్చు. లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 

Also read: Viral News: కుక్కలను చూసుకుంటే రూ. కోటి జీతం..లగ్జరీ జెట్‌లో ప్రయాణాలు..ఇదేం జాబ్ రా బాబు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Reserve bank of india declared july 2023 holidays list, 14 days banks remained closed in july and check the july bank holidays list
News Source: 
Home Title: 

July Bank Holidays: జూలై నెలలో 14 రోజులు బ్యాంకులు బంద్, ఎప్పుడెప్పుడు ఎక్కడ సెలవంటే

July Bank Holidays: జూలై నెలలో 14 రోజులు బ్యాంకులు బంద్, ఎప్పుడెప్పుడు ఎక్కడ సెలవంటే
Caption: 
Bank Holidays ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
July Bank Holidays: జూలై నెలలో 14 రోజులు బ్యాంకులు బంద్, ఎప్పుడెప్పుడు ఎక్కడ సెలవంటే
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Monday, June 26, 2023 - 23:51
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
39
Is Breaking News: 
No
Word Count: 
415