BMW Car Changing Colours While Moving : కారు కొంటే అలాంటిలాంటి కారు కొనొద్దు.. బిఎండబ్ల్యూ కారునే కొనాలి.. ఇది చాలా మంది ధనికుల కల. బిఎండబ్ల్యూ కారు అంటే పేదోళ్ల కారు కాదు.. బాగా డబ్బున్న వాళ్లకు మాత్రమే బిఎండబ్ల్యూ కారు కొనగలరు అని సమాజంలో ఒక భావన ఉంది. బిఎండబ్ల్యూ కారుకు ఉండే క్రేజ్ కూడా అలాంటిది. మెర్సిడెస్ బెంజ్, ఆడి, ఓల్గా లాంటి కార్ల బ్రాండ్స్ కూడా రిచ్ క్లాస్ కార్లే అయినప్పటికీ.. హై టెక్నాలజీ ఇంజన్స్, డిజైన్, ఫీచర్స్, రిప్యూటేషన్ పరంగా బిఎండబ్ల్యూ కార్ల బ్రాండ్‌కి ఉన్న ఇమేజే వేరు.
ఇప్పటికే ఎన్నో ప్రత్యేకతలతో ఆకట్టుకుంటున్న బిఎండబ్ల్యూ కార్ల బ్రాండ్ తాజాగా మరో సరికొత్త ఇన్నేవేషన్‌ని ఆటోమొబైల్ ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఇది ఎలాంటి ఆవిష్కరణ అంటే.. రాబోయే రోజుల్లో కార్ల డిజైనింగ్ విషయంలో యావత్ ప్రపంచాన్ని ఊపేసే ఒక కీ ఫ్యాక్టర్ కానుంది. అదేంటంటే.. కస్టమర్లకు పెద్దగా కష్టం లేకుండానే తమ కారు కలర్ మార్చుకోవచ్చు. అది కూడా కారు రన్నింగులో ఉండగానే ఒక సింగిల్ క్లిక్‌తో కారు కలర్ చేంజ్ అయిపోతుంది. ఏంటి నమ్మలేకపోతున్నారా ? అయితే, ఇదిగో ఈ వీడియో చూడండి.. అసలు విషయం ఏంటో మీకే అర్థం అవుతుంది.
BMW's can now change colors pic.twitter.com/UpR04kZWfg
— Insane Reality Leaks (@InsaneRealitys) June 29, 2023
ఇది కూడా చదవండి : Boss Vs Employee: పెళ్లి కాలేదని వీక్ ఆఫ్ రోజు డ్యూటీకి రమ్మన్నాడు.. ఉద్యోగి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు
చూశారు కదా.. వాస్తవానికి ఎవరికైనా కారు కొనేటప్పుడు ఏ కారును ఎంచుకోవాలి అని ఆలోచించే క్రమంలో ఎదురయ్యే పెద్ద పెద్ద సవాళ్లలో కారు కలర్ కూడా ఒకటి. ఇంజన్, ఫీచర్స్, ధర, మైలేజ్ లాంటి అంశాల విషయంలో ఎలాగైతే ఆలోచిస్తామో.. అలాగే కారు కొనేటప్పుడు ఏ కలర్ కారు ఎంచుకోవాలి అనే విషయంలోనూ అంతే తర్జనభర్జనలు పడుతుంటాం. కలర్ కి ఉండే ప్రాధాన్యత అలాంటిది. కానీ ఇదిగో ఇప్పుడు మనం చూసిన BMW iX Flow కారు కొనేవాళ్లకు ఆ టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే వాళ్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు కలర్ మార్చుకోవచ్చు. ఈ వీడియోలో ఉన్న BMW iX Flow కారు వైట్ కలర్ నుంచి బ్లాక్ హ్యూ, ఆ తరువాత గ్రే కలర్‌లోకి మారడం మనం వీడియోలో చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి : Hotel Waiter To IAS Officer: హోటల్లో వెయిటర్‌గా పనిచేసుకుంటూ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK