Dengue Alert: వర్షాకాలం వచ్చేసింది, డెంగ్యూ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, డెంగ్యూ సోకితే ఏం చేయాలి

Dengue Alert: వర్షాకాలం వచ్చేసింది. సీజనల్ వ్యాధులు చుట్టుముడతాయి. దోమల బెడద ఎక్కువయ్యే కొద్దీ డెంగ్యూ ముప్పు పొంచి ఉంటుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రాణాంతకమైన డెంగ్యూ వైరస్ బారిన పడతారు, తస్మాత్ జాగ్రత్త.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 9, 2023, 12:41 AM IST
Dengue Alert: వర్షాకాలం వచ్చేసింది, డెంగ్యూ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, డెంగ్యూ సోకితే ఏం చేయాలి

Dengue Alert: వర్షాకాలం వచ్చిందంటే వేసవి నుంచి ఉఫసమనం లభించడమే కాకుండా సీజనల్ వ్యాదుల బయం కూడా ఉంటుంది. దోమల బెడద ఎక్కువైతే సహజంగానే డెంగ్యూ ముప్పు అధికమౌతుంది. డెంగ్యూ వ్యాధి సోకితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్లేట్జ2లెట్ కౌంట్స్ ప్రాధాన్యత ఏంటనేది తెలుసుకుందాం..

వర్షాకాలం ప్రారంభం కాగానే డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వ్యాధుల భయం వెంటాడుతుంటుంది. ముఖ్యంగా  డెంగ్యూ ప్రమాదం పొంచి ఉంటుంది. డెంగ్యూ అనేది అతి ప్రమాదకర స్తితి. డెంగ్యూ వచ్చిందంటే చాలు ప్లేట్‌లెట్ల సంఖ్య వేగంగా తగ్గి ప్రాణాంతకంగా మారుతుంది. డెంగ్యూలో ప్లేట్‌లెట్ కౌంట్ అనేది చాలా ముఖ్యమైనది. ప్లేట్‌లెట్స్ కౌంట్ ఎంత ఉండాలి, ఎలా ప్లేట్‌లెట్స్ కౌంట్ పెంచుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

డెంగ్యూ సోకితే గంట గంటకూ  కౌంట్ పడిపోతుంటుంది. వెంటనే ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గినప్పుడు  తక్షణం ప్లేట్‌లెట్స్ ఎక్కించకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. సాధారణంగా ఆరోగ్యవంతుడైన మనిషి శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య 3-4 లక్షల వరకూ ఉంటుంది. ఇది 60- 80 వేల వరకూ పడిపోయినా నష్టం లేదు. కానీ 20 వేలకంటే దిగువకు పడిపోతే మాత్రం ప్రమాదకరంగా భావిస్తారు. రోగి ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో వెంటనే ప్లేట్‌లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది. 

సాధారణంగా రక్తదాత ఇచ్చిన రక్తంలోంచి ఎర్రరక్తకణాలు, ప్లాస్మా, ప్లేట్‌లెట్లను వేరు చేసి ప్లేట్‌లెట్లను విడిగా ప్యాక్ చేసి అవసరమైనవారికి ఎక్కిస్తుంటారు. ఈ ప్రక్రియ బ్లడ్ బ్యాంకుల్లో జరుగుతుంటుంది. మీ బ్లడ్ అక్కడ ఇచ్చి మీక్కావల్సిన ప్లేట్‌లెట్లను సేకరించవచ్చు. 

అయితే ఇలా కాకుండా ఎప్పట్నించో అనాదిగా అమల్లో ఉన్న పద్ధతి ఉంది. అది బొప్పాయి ఆకుల రసం.  దీనికోసం లేత బొప్పాయి ఆకులను పిండి రసం తీయాలి. ఈ రసాన్ని ఉదయం, రాత్రి డెంగ్యూ రోగులకు తాగిస్తే చాలా వేగంగా ప్లేట్‌లెట్లు పెరిగిపోతాయి.అయితే అప్లాస్టిక్ అనీమియా, లుకేమియా, లింఫోమా, డెంగ్యూ, వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు తెల్ల రక్తకణాలతో పాటు ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గిపోతుంది.

Also read: Bay Leaf Benefits: బిర్యానీ ఆకుల టీతో శరీరానికి కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News