Shravan Somvar 2023: శ్రావణ మాసానికి హిందూ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. అంతేకాకుండా శ్రావణ మాసంలోని మొదటి సోమవారం రోజు సాక్ష్యత్తు పరమశివుడు నింగి నుంచి భూమిపైకి దిగి వస్తాడు. అందుకే చాలా మంది హిందువులు ఈ శ్రావణ మాసంలో మొత్తం 8 సోమవారాలు ఉపవాసాలు పాటిస్తారు. అయితే ఈ రోజు సుకర్మ యోగం, రేవతి నక్షత్రం శుభ స్థానంలో ఉండబోతున్నాయి. శ్రావణ మాసంలోని మొదటి సోమవారం రోజున భక్తి శ్రద్దలతో శివుడిని పూజించడం వల్ల జీవితంలో సంతోషం, శ్రేయస్సు, పురోగతి కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే శ్రావణ ఉపవాసాలు చేసేవారు తప్పకుండా నియమాలతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. శ్రావణ మాసం సోమవారం రోజున ఎలాంటి నియమాలతో పూజా కార్యక్రమాలు చేయడం వల్ల మంచి జరిగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శ్రావణ మాస వ్రతం పాటించేవారు తప్పకుండా ఈ నియమాలు పాటించాలి:
✽ శ్రావణ మాస వ్రతాన్ని పాటించేవారు తీసుకునే ఆహారంలో ఉప్పును వినియోగించకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో రాక్ సాల్ట్ తీసుకుంటే మంచిది.
✽ శ్రావణ మాస శివ పూజలో భాగంగా తప్పకుండా పచ్చి ఆవు పాలతో శివుడికి అభిషేకం చేయాల్సి ఉంటుంది. అభిషేకం చేసే రోజున తప్పకుండా ఉపవాసాన్ని పాటించాల్సి ఉంటుంది.
Also read: Dark Circles: డార్క్ సర్కిల్స్ మీ అందాన్ని పాడుచేస్తున్నాయా, ఈ చిట్కాలు పాటిస్తే చాలు
✽ శ్రావణ మాస సోమవారం శివ పూజలో భాగంగా నలుపు రంగు వస్తువులను వినియోగించకూడదు. అంతేకాకుండా తీసుకునే ఆహారాల్లో వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసం, ఆల్కహాల్, మసాలా ఆహారం, వంకాయ, పిండి, మైదా ఉండకుండా చూసుకోవాల్సి ఉంటుంది.
✽ శివారాధన చేసేవారు కామం, క్రోధం, లోభం వంటి చెడు గుణాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. తప్పకుండా పూజలో భాగంగా భక్తి శ్రద్ధలు పాటించాల్సి ఉంటుంది.
శ్రావణ మాస మొదటి శనివారం పూజ ముహూర్త :
శ్రావణ మాస మొదటి సోమవారం వ్రతాన్ని పాటించేవారు తప్పకుండా ఉదయాన్నే నిద్రలేవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అమృత్-ఉత్తమ ముహూర్తం ఉదయం 05.30 నుంచి 07.14 వరకు మాత్రమే పూజా కార్యక్రమాలు చేయాలి. ఈ రోజు శుభ ముహూర్తం ఉదయం 08.58 నుంచి ప్రారంభమవుతుంది. జూలై 10వ తేదిన మొదటి సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 06.43 వరకు రుద్రాభిషేకం చేయాల్సి ఉంటుంది.
Also read: Dark Circles: డార్క్ సర్కిల్స్ మీ అందాన్ని పాడుచేస్తున్నాయా, ఈ చిట్కాలు పాటిస్తే చాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook