Samajavaragamana OTT: 'సామజవరగమన' ఓటీటీ ఫార్టనర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

Samajavaragamana OTT:  యువనటుడు శ్రీవిష్ణు, సీనియర్ నటుడు నరేశ్‌ తండ్రీకుమారులుగా నటించి కడుపుబ్బా నవ్వించిన రీసెంట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'సామజవరగమన'. ’హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 17, 2023, 09:12 AM IST
Samajavaragamana OTT: 'సామజవరగమన' ఓటీటీ ఫార్టనర్ ఫిక్స్..  స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

Samajavaragamana OTT Release date: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ 'సామజవరగమన’. రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా రెబా మోనికా జాన్‌ హీరోయిన్ గా పరిచయమైంది. నరేశ్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, వెన్నెల కిషోర్‌, రాజీవ్‌ కనకాల కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చి ఈ సినిమా జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా వచ్చిన సామజవరగమన బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. వారం రోజుల్లోనే రూ.30 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ఆడుతుంది. శ్రీవిష్ణు కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ హిట్ అనే చెప్పాలి. ఈ సినిమా ఎప్పుడు ఓటీటీ ఎంటీ ఇవ్వబోతుందా అని ఫ్యాన్స్ అందరూ ఎదురుచూస్తున్నారు. 

సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. త్వరలో ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా దక్కించుకుంది.  ఈ విషయాన్ని కన్ఫామ్స్ చేస్తూ.. ఆహా తాజాగా ఓ పోస్ట్‌ పెట్టింది. అయితే ఈ మూవీ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందనే విషయం పేర్కొనలేదు. థియేటర్లలో సాలిడ్ హిట్ కొట్టిన ఈ సినిమా ఓటీటీలోకి ఏ మేరకు ఆడుతుందో చూడాలి. ఇందులో తండ్రీ కొడుకుల నటించిన శ్రీవిష్ణు, నరేష్ మధ్య సీన్స్ అడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తాయి. సెకండాఫ్ లో శ్రీనివాస్ అయ్యంగార్, వెన్నెల కిషోర్ చేసే కామెడీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రెబా మోనికా జాన్‌ తన నటన, అందంటో ఆకట్టుకుంది. 

Also read: Jailer Movie: చిక్కుల్లో రజినీ 'జైలర్'.. టైటిల్ మార్చాలంటూ కోర్టుకెక్కిన డైరెక్టర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News