గీత గోవిందం కలెక్షన్స్ : విజయ్ దేవరకొండ ఖాతాలో మరో అదిరిపోయే రికార్డ్ !

Last Updated : Aug 28, 2018, 01:35 PM IST
గీత గోవిందం కలెక్షన్స్ : విజయ్ దేవరకొండ ఖాతాలో మరో అదిరిపోయే రికార్డ్ !

నటుడు విజయ్ దేవరకొండకు గీత గోవిందం సినిమా మరిచిపోలేని సక్సెస్ అందించింది. ఇప్పటికే పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి వంటి సూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ.. తాజాగా గీత గోవిందం సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లోనూ ప్రవేశించడం అభినందించదగిన విషయం. బాక్సాఫీస్ వర్గాలు వెల్లడిస్తోన్న సమాచారం ప్రకారం.. చిన్న సినిమాగా రిలీజైన గీత గోవిందం సినిమా రెండో వారంలోనే రూ.100 కోట్ల క్లబ్‌లో ప్రవేశించింది.

 

సినిమా మొత్తం కలెక్షన్స్ రూ.102 కోట్ల మైలు రాయి అందుకోగా సినిమా షేర్స్ రూ.52.11 కోట్ల మార్క్‌ని చేరుకున్నట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ఈమేరకు ట్విటర్‌లో పోస్ట్ అయిన ఓ ట్వీ్ట్‌ని గీత గోవిందం సినిమా దర్శకుడు పరశురామ్ రిట్వీట్ చేయడం గమనించొచ్చు.  

Trending News