Car Loan Tips: కారు లోను తీసుకుంటున్నారా, ఈ విషయాలు గుర్తుంచుకుంటే ఈఎంఐ సులభమౌతుంది

Car Loan Tips: కారు కొనాలనే ఆలోచన ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అధిక శాతం ప్రజానీకం కారు కొనుగోలుకు లోన్‌పై ఆధారపడుతుంటారు. కారు లోను తీసుకోవడం ప్రస్తుత తరుణంలో సులభమే. కానీ ఈఎంఐ చెల్లించేటప్పుడే ఇబ్బందులు ఎదురౌతుంటాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 22, 2023, 04:33 PM IST
Car Loan Tips: కారు లోను తీసుకుంటున్నారా, ఈ విషయాలు గుర్తుంచుకుంటే ఈఎంఐ సులభమౌతుంది

Car Loan Tips: కారు లోను తీసుకున్నప్పుడు ఈఎంఐ భారం కాకుండా ఉండాలంటే కొన్ని విషయాలు పరిగణలో తీసుకోవల్సి ఉంటుంది. బడ్జెట్ పూర్తిగా లేనప్పుడు చాలామంది లోన్లపైనే ఆధారపడి కారు కొనుగోలు చేస్తుంటారు. కారు రుణం ప్రక్రియ కూడా చాలా సులభమైపోయింది. కానీ ఈఎంఐ మాత్రం భారమౌతోంది. అందుకే కారు లోను తీసుుకునేటప్పుడే కొన్ని విషయాల్ని పరిగణలో తీసుకోవాలి. దీనివల్ల రుణం చెల్లింపు సులభమౌతుంది.

కారు కొనేటప్పుడు మీరు మీ బడ్జెట్‌ను పరిగణలో ఉంచుకోవాలి. మీ ఖర్చుల్ని బట్టి కారును ఎంచుకోవల్సి ఉంటుంది. దీనివల్ల కారు లోను సులభంగా లభిస్తుంది. అటు ఈఎంఐ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా చెల్లించేందుకు వీలవుతుంది. మీరు చెల్లించే ఈఎంఐ మీ జీతంలో 10 శాతం కంటే ఎక్కువ కాకుండా చూసుకోండి. మీరు తీసుకునే రుణ వ్యవధి ఎంత ఉంటుందనేది కూడా చాలా ముఖ్యం. గరిష్టంగా నాలుగేళ్ల రుణ వ్యవధి ఉండవచ్చు. ఒక కారుకు 4 ఏళ్లంటే ఎక్కువ సమయం కానే కాదు. ప్రతి నెలా ఈఎంఐ చెల్లించడం కూడా సులభమౌతుంది.

రుణం కోసం దరఖాస్తు చేసేముందు బ్యాంకు లోన్ క్రైటేరియాకు మీరు సరిపోతారో లేదో చూసుకోవాలి. ఎందుకంటే చాలా బ్యాంకులు క్రెడిట్ స్కోర్ ఆధారంగా రుణాలు ఇస్తుంటాయి. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే రుణం కూడా సులభంగా వస్తుంది. బ్యాంకుల ఆఫర్లు కూడా తెలుసుకోవాలి. వడ్డీ రేటు, ప్రోసెసింగ్ ఫీజు వంటివి పరిగణించాలి. ఏ బ్యాంకు ఆఫర్ బాగుందో చూసుకుని అక్కడ్నించి రుణం పొందవచ్చు.

ఈఎంఐ తక్కువగా ఉండాలంటే డౌన్ పేమెంట్ ఎక్కువగా ఇచ్చి రుణం తక్కువ తీసుకోవచ్చు. డౌన్ పేమెంట్ ఎక్కువగా ఉంటే ఈఎంఐ తగ్గుతుంది. కారు రుణం తీసుకునే ముందు సరైన బ్యాంకును ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. బ్యాంకును ఎంపిక చేసేముందు ఆ బ్యాంకు సేవలు ఎలా ఉన్నాయి. వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి, ప్రోసెసింగ్ ఫీజు ఎంతనే వివరాలు పూర్తిగా పరిశీలించాలి. ఈ అన్ని విషయాలు పరిగణలో తీసుకుంటేనే కారు రుణం తీసుకున్నాక చెల్లింపులో ఏ విధమైన ఇబ్బంది ఎదురుకాదు. 

Also read: Bank Working Days: బ్యాంకులు పని చేసేది ఐదు రోజులే.. అప్పుడే కీలక నిర్ణయం..!

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News