Things To Check Before Applying For Home Loans: హోమ్ లోన్ తీసుకుంటున్నారా ? హోమ్ లోన్ తీసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసా ? జాగ్రత్తలు పాటించకుండా హోమ్ లోన్ తీసుకుంటే వచ్చే సమస్యలు అన్ని ఇన్నీ కావు. అన్నింటికి మించి హోమ్ లోన్ అంటేనే తిరిగి చెల్లించేందుకు అన్ని రకాల లోన్స్ కంటే చాలా ఎక్కువ కాలం పడుతుంది. తీసుకున్న రుణాన్ని, ఇఎంఐని బట్టి 20 ఏళ్ల నుంచి 25 ఏళ్లు, 30 ఏళ్ల వరకు లోన్ టెన్యూర్స్ ఉంటాయి. హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే ఎదురయ్యే సమస్యలు.. ఆ లోన్ మొత్తం తిరిగి చెల్లించేవరకు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ జాగ్రత్తలు ఏంటో ఒకసారి చెక్ చేద్దాం.
ఇఎంఐలతో సహా నెలవారీ బడ్జెట్ :
హోమ్ లోన్ తీసుకునే ముందు నెల నెల ఎంత ఇఎంఐకి అవసరం అయ్యే మొత్తంతో పాటు ఇతర ఖర్చులు కూడా కలుపుకుని ప్రతీ నెల ఎంత మొత్తం సంపాదించాల్సి ఉంటుందో ఒక లెక్క వేసుకోండి. అంతకు మించి ఖర్చులు లేకుండా మీ ఆర్థిక వ్యవహారాలు ప్లాన్ చేసుకోండి. లేదంటే సకాలంలో ఇఎంఐలు చెల్లించడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సకాలంలో చెల్లించకపోతే చెక్ బౌన్స్ ఫైన్స్, అదనపు వడ్డీలు, క్రెడిట్ స్కోర్ దెబ్బ తినడం వంటివి జరుగుతాయి. అదే కానీ జరిగితే.. అత్యవసరంలో మీకు మరే ఇతర రుణాలు మంజూరు కావు.
ఏకకాలంలో రెండు, మూడు బ్యాంకులకు లోన్ కోసం అప్లై చేయకండి
హోమ్ లోన్ తీసుకోవాలనే తొందరలో ఏదో ఒక్కచోట ఓకే అవుతుంది అనే భావనతో ఒకేసారి మూడ్నాలుగు బ్యాంకుల్లో హోమ్ లోన్ కోసం అప్లై చేస్తుంటారు. అలా చేయడం తప్పు. ఎందుకంటే.. మీరు ఎన్ని బ్యాంకుల్లో హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేస్తారో.. అన్ని బ్యాంకులు మీ క్రెడిట్ స్కోర్ కోసం ఆరా తీస్తాయి. ఎంత ఎక్కువ క్రెడిట్ చెక్ జరిగితే.. మీరు డబ్బుల కోసం అంత వెంపర్లాడుతున్నారని బ్యాంకులు భావిస్తాయి. అలాంటి సందర్భంలో మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. అదే కానీ జరిగితే.. మీకు బ్యాంకులు అంత ఈజీగా రుణం మంజూరు చేయవు.. ఒకవేళ లోన్ మంజూరు చేసినా.. వడ్డీ రేటు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అందుకే ఏకకాలంలో ఎక్కువ బ్యాంకులకు లోన్ కోసం దరఖాస్తు చేసుకోవద్దు.
హోమ్ లోన్ ఆఫర్స్ కంపేర్ చేయండి
హోమ్ లోన్స్‌పై రకరకాల బ్యాంకులు రకరకాల ఆఫర్స్ ఇస్తుంటాయి. ఏ బ్యాంక్ ఇచ్చే ఆఫర్ బాగుందో చెక్ చేయండి. ఇతర బ్యాంకుల ఆఫర్లతో సరిపోల్చి చూడండి. వడ్డీ రేటు పరంగా తక్కువ ఉండటమే కాకుండా డాక్యుమెంటేషన్ విషయంలో ఇబ్బంది పెట్టకుండా, అధిక ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయకుండా ఉండే అంశాలు కూడా బేరీజు వేసుకోండి. ఆ తరువాత ది బెస్ట్ ఆఫర్ ఇచ్చే బ్యాంక్ నుంచి హోమ్ లోన్ ఎంపిక చేసుకోండి.
క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకున్నారా ?
బ్యాంకులు ఏదైనా లోన్ మంజూరు చేయాలంటే ముందుగా మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తారు. మీ సిబిల్ స్కోర్ 750 కంటే తక్కువగా ఉంటే రుణం ఇవ్వడం కష్టం. మీ క్రెడిట్ హిస్టరీని బట్టి మీ స్కోర్ పెరగడం, తగ్గడం జరుగుతుంటుంది. అందుకే లోన్ కోసం వెళ్లడానికంటే ముందుగా మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకుని, అవసరమైన స్కోర్ ఉందనుకుంటేనే లోన్ కోసం దరఖాస్తు చేయండి. లేదంటే మీ స్కోర్ సరిగ్గా లేని కారణంగా లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు.
ఇది కూడా చదవండి : Tata Altroz Cars: టాటా ఆల్ట్రోజ్‌లో రెండు కొత్త వేరియంట్స్.. రెండూ చీప్ అండ్ బెస్ట్ కార్లే
డౌన్ పేమెంట్
మీరు కొనే ఇంటి విలువకు సమానంగా బ్యాంకులు లోన్ మంజూరు చేయవు. మీ సిబిల్ స్కోర్ ఆధారంగా మీరు కొనే ప్రాపర్టీ విలువలో 75 శాతం నుంచి 90 శాతం వరకు లోన్ మంజూరు చేస్తారు. మిగతా డౌన్ పేమెంట్‌ని మీరే సమకూర్చూకోవాల్సి ఉంటుంది. అందుకే అవసరం ఉన్న మొత్తం కంటే ఇంకొంచెం ఎక్కువగా డబ్బులు సర్దుబాటు చేసి పెట్టుకోండి. లేదంటే బ్యాంకు రుణం ఇచ్చినా సకాలంలో డౌన్ పేమెంట్ చేయలేని పక్షంలో మీరు కొనాలనుకున్న ప్రాపర్టీ చేజారిపోయే ప్రమాదం ఉంటుంది.
ఇది కూడా చదవండి : Easy Tips To Save Money: డబ్బులను ఈజీగా పొదుపు చేసే మార్గాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి