దాదాపు రెండున్నరేళ్ల క్రితం సోనీలివ్‌లో స్ట్రీమ్ అయిన స్కామ్ 1992 చాలా సెన్సేషన్ సృష్టించింది. 1990-92 ప్రాంతంలో దేశంలోని షేర్ మార్కెట్‌ను శాసించిన బిగ్బుల్ హర్షద్ మెహతా కుంభకోణం ఎపిసోడ్ ఆధారంగా నిర్మితమైన వెబ్‌సిరీస్ ఇది. అందుకే ఓ సంచలనం నమోదు చేసింది. ఇప్పటికీ ఐఎండీబీ రేటింగ్స్‌లో టాప్‌లో ఉంది. అందుకే ఇప్పుడీ స్కామ్ సీక్వెల్‌పై అంచనాలు పెరుగుతున్నాయి.
ఇండియాలో జరిగిన ఓ షేర్ మార్కెట్ కుంభకోణం ఆధారిత వెబ్‌సిరీస్ స్కామ్ 1992 ఇప్పటికీ ప్రపంచంలోని ఆల్ టైమ్ పాపులర్ వెబ్ సిరీస్‌లలో ఒకటిగా ఉంది. సోనీలివ్‌లో ప్రసారమైన ఈ వెబ్‌సిరీస్‌కు అద్భుతమైన రేటింగు దక్కింది. ఇప్పుడీ వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా మరో స్కాం రూపొందింది. ఇది కూడా దేశంలో జరిగిన మరో భారీ కుంభకోణం. 2003లో దేశాన్ని కుదిపేసిన తెల్గీ స్కామ్ ఇది. ది తెల్గీ స్టోరీ పేరుతో స్ట్రీమింగ్ కానుంది. 2003లో దేశంలో కలకలం రేపిన నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణమిది. ఈ స్కాం సూత్రధారి అబ్దుల్ కరీం తెల్గీ శిక్ష పొందుతూ జైలులోనే మరణించాడు. అతడి జీవితంలోని వాస్తవ ఘటనల ఆధారంగా ది తెల్గీ స్టోరీ స్ట్రీమ్ అయింది. సోనీలివ్‌లో సెప్టెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణం ద్వారా అబ్దుల్ కరీం తెల్గీ 30 వేల కోట్లు కూడబెట్టారని అంచనా. ఈ స్కాం కూడా ఓ జర్నలిస్ట్ కారణంగా వెలుగుచూసింది. సంజయ్ సింగ్ అనే జర్నలిస్ట్ రాసిన రిపోర్టర్ కీ డైరీ ఆధారంగా స్కామ్ 2003 తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్‌లో కర్ణాటకకు చెందిన ఓ పండ్ల వ్యాపారి కరీం నకిలీ స్టాంప్ పేపర్లు ఎలా తయారు చేశాడు, ఎలా పట్టుబడ్డాడు, ఇందులో ఎవరెవరున్నారనే వివరాల్ని పూర్తిగా చూపించారు. ఇప్పటికే విడుదలైన ఈ వెబ్‌సిరీస్ టీజర్ అందర్నీ బాగా ఆకట్టుకుంటోంది.
Khel bada tha, aur khiladi...!
The story of one of India's biggest scam by Abdul Karim Telgi, which shocked the nation with its unimaginable scale.
Streaming on 2nd September, only on Sony LIV@SonyLIV @SonyLIVIntl pic.twitter.com/EcK578UuoO— Sony LIV (@SonyLIV) August 4, 2023
స్కామ్ 2003లో డబ్బులనేవి సంపాదించబడవు, తయారు చేయబడతాయనే డైలాగ్ వైరల్ అవుతోంది. స్కామ్ 1992లో ఇష్క్ హైతో రిస్క్ హై అనేది ఫ్యామస్ డైలాగ్. ఆట పెద్దదే కానీ ఆటగాడు ఒక్కడే అనేది మరో డైలాగ్.
Also read: Samantha: ఆ నటుడితో రూ.25 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన సమంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook