Boda kakarakaya: బోడ కాకర కాయతో బోలెడు లాభాలు..ఇలా తింటే సులభంగా బరువు తగ్గుతారట..

Boda kakarakaya Health Benefits: బోడ కాకర కాయలను క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 6, 2023, 04:28 PM IST
Boda kakarakaya: బోడ కాకర కాయతో బోలెడు లాభాలు..ఇలా తింటే సులభంగా బరువు తగ్గుతారట..

 

Boda kakarakaya Health Benefits:  బోడ కాకర కాయలు మార్కెట్‌లో ఎక్కువగా వర్షకాలంలో కనిపిస్తాయి. వీటిలో అనేక రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లు వీటిని క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా అదుపులో ఉంటాయి. ఇవి తెలంగాణాలో ఎక్కువగా ఆదిలాబాద్‌ ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తాయి. వీటిని తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వర్షాకాలంలో వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బోడ కాకర కాయల్లో లభించే పోషకాలు:
బోడ కాకర కాయల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో  విటమిన్ సి, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, గ్లైకోసైడ్లు, అమైనో ఆమ్లాలులతో పాటు జింక్, పొటాషియం, ఫాస్పరస్ ఉంటాయి. కాబట్టి క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

బోడ కాకర కాయ ప్రయోజనాలు:
✾ బోడ కాకర కాయ మధుమేహంతో బాధపడుతున్నవారికి ఎంతో ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు గ్లైసెమిక్ ఇండెక్స్‌పై ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. దీంతో మధుమేహం కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. 

✾ బరువు తగ్గాలనుకునేవారికి కూడా బోడ కాకర కాయ ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో అధిక పరిమాణంలో  ఫైబర్ లభిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడమేకాకుండా శరీరం యాక్టివ్‌గా తయారవుతుంది. 

Also Read:Ileana Dcruz baby: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా?

✾ బోడ కాకర కాయలో పొటాషియం కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి తరచుగా రక్తపోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీటిని ఆహారాల్లో తీసుకోవాల్సి ఉంటుంది. 

✾ బోడ కాకర కాయలో క్యాన్సర్‌తో పాటు గుండె సమస్యలను నివారించే అనేక రకాల మూలకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో  విటమిన్ సి కూడా ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా వీటిని తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. 

Also Read:Ileana Dcruz baby: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News