Top Safety Features in Car: కారు కొనేటప్పుడు ఆ కారులో ఉండే సేఫ్టీ ఫీచర్ల గురించి ప్రధానంగా తెలుసుకోవాలి. లేకపోతే ఇంట్లో కుటుంబసభ్యుల ప్రాణాల్ని పణంగా పెట్టడమే అవుతుంది. ముఖ్యంగా 5 సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయో లేదో పరిశీలిస్తే మంచిది. ఆ టాప్ 5 సేఫ్టీ ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
కొత్త కారు కొనేటప్పుుడు అందులో సేఫ్టీ ఫీచర్లు, పని తీరు ఎలా ఉన్నాయో తెలుసుకోవల్సి ఉంటుంది. చాలామంది కారు డిజైన్, లుక్, మైలేజ్ వంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇప్పుడు వినియోగదారులు కారులో ఉండే సేఫ్టీ ఫీచర్ల గురించి ఆలోచిస్తున్నారు. ఇది మంచి పరిణామం. అయితే ఏ సేఫ్టీ ఫీచర్లు ఉండాలో తెలుసుకుందాం..మీ కారులో ఎలాంటి సేఫ్టీ ఫీచర్లు అవసరం, వేటికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలుసుకుందాం..
1. ఎయిర్ బ్యాగ్స్
మీరు కొనే కారు చౌకదైనా లేదా ఖరీదైంది అయినా అందులో ఎయిర్ బ్యాగ్స్ ఉండటం చాలా అవసరం. ఏదైనా దుర్ఘటన జరిగితే ప్రమాద తీవ్రతను తగ్గిస్తాయి. డ్రైవర్‌తో పాటు ప్రయాణీకుల ప్రాణాలు కూడా కాపాడవచ్చు. ప్రస్తుతం ఇండియాలో విక్రయమౌతున్న చాలా కార్లలో డ్యూయర్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటున్నాయి. కానీ కార్లలో 6 ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరిగా ఉండాలనే నిబంధన పెట్టింది ప్రభుత్వం.
2. ఏబీఎస్-యాంటీ బ్రేకింగ్ సిస్టమ్
ఇటీవల కార్లలో సేఫ్టీ ఫీచర్లలో భాగంగా ఈబీడీతో పాటు ఏబీఎస్ వంటి ఫీచర్లు ఉంటున్నాయి. అంటే యాంటీ బ్రేకింగ్ సిస్టమ్. సడెన్ బ్రేక్ వేసినప్పుడు కారుని నియంత్రణలో ఉంచుతుంది. సాధారణంగా హఠాత్తుగా బ్రేక్ వేసినప్పుడు కారు ముందు లాక్ పడిపోతుంది. దాంతో ప్రమాదం తీవ్రత పెరిగిపోతుంది. ఈ పరిస్థితిని నివారించేందుకు ఏబీఎస్ చాలా ఉపయోగకరమైన ఫీచర్. అంతేకాకుండా మంచు లేదా వర్షం కారణంగా రోడ్లపై స్కిడ్ కాకుండా ఉంటుంది.
3. ఈఎస్‌సి-ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్
ఓవర్ స్టెయిర్ లేదా అండర్ స్టెయిర్ కారణంగా చాలా సందర్భాల్లో కారు నియంత్రణ కోల్పోతుంది. దీన్నించి తప్పించుకునేందుకు అత్యవసర పరిస్థితుల్లో ఈఎస్‌సి బ్రేక్ వేస్తుంది. ఇంజన్ పవర్‌ను బ్యాలెన్స్ చేస్తుంది.
4. ఎడ్జస్టబుల్ స్టీరింగ్
చాలా సందర్భాల్లో స్టీరింగ్ వీల్ , డ్రైవర్ మధ్య దూరం, ఎత్తు సరిగ్గా లేనందున కారు నడపడంలో ఇబ్బంది ఎదురౌతుంది. ఇది ప్రమాదాలకు దారితీయవచ్చు. అందుకే ఎడ్జస్టబుల్ స్టీరింగ్ ఉండటం చాలా అవసరం. దీనివల్ల డ్రైవర్‌కు స్టీరింగ్ వీల్ ఎత్తు , డ్రైవర్‌కు స్టీరింగ్‌కు మధ్య దూరాన్ని సరి చేసేందుకు వీలవుతుంది.
5. టైర్ ప్రెషర్ మోనిటరింగ్ సిస్టమ్-టీపీఎంఎస్
కారుపై సరైన నియంత్రణ, ఇంధన పొదుపు కోసం ఇటీవల కార్లలో టైర్ ప్రెషర్ మోనిటరింగ్ సిస్టమ్ -టీపీఎంఎస్ అమర్చుతున్నారు. ఇది కారుకుండే ప్రతి చక్రానికి అమర్చుతారు. అంటే సెన్సార్ ద్వారా డ్రైవర్‌కు సూచనలు అందుతాయి. అందుకే కారు కొనేముందు ఈ సేప్టీ ఫీచర్లు ఉండేట్టు చూసుకుంటే చాలు.
Also read; Ambareesh Murty: గుండెపోటుతో ప్రముఖ వ్యాపారవేత్త అంబరీష్ మూర్తి కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook