మీరు ఎక్కడికైనా వెళ్లాలనుకునేటప్పుడు.. వెయిటింగ్ లిస్టులో టికెట్ దొరికితే.. పీఎన్ఆర్ స్టేటస్ తెలుసుకోవడానికి ఎంతలా ఇబ్బందులు పడతారో చెప్పనక్కర్లేదు. అందుకోసం ఇండియన్ రైల్వే వెబ్‌సైట్, రిజర్వేషన్ ఎంక్వైరీ నంబర్ 139, ఐఆర్‌సీటీసీ పోర్టల్ ద్వారా స్టేటస్ తెలుసుకొనే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఆ ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. ప్రయాణీకుల అవాంతరాలను దృష్టిలో ఉంచుకుని, సేవలను మరింత సులభతరం చేయడానికి భారతీయ రైల్వేలు ఇటీవలే మేక్‌మై ట్రిప్ (MakeMy Trip)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో ప్రయాణీకులు PNR స్టేటస్, లైవ్ ట్రైన్ స్టేటస్‌తో పాటు ఇతర సమాచారాన్ని పొందవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందంటే..
ఇవి తప్పని సరి:
* ముందుగా మీ స్మార్ట్ ఫోన్‌లో అప్‌డేటెడ్ (లేటెస్ట్ వర్షన్) వాట్సాప్ ఉండాలి.
* ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.
* ట్రైన్ నెంబర్, PNR నెంబర్ ఉండాలి.
ఎలా పనిచేస్తుంది:
* స్మార్ట్ ఫోన్‌లో డైలర్ యాప్ ఓపెన్ చేయండి.
* '7349389104' (అధికారిక MakeMyTrip WhatsApp నెంబర్) నెంబర్‌ను టైప్ చేసి, మీ కాంటాక్ట్‌లలో సేవ్ చేయండి.
* సేవ్ చేశాక.. మీ వాట్సాప్ ఓపెన్ చేసి కంటాక్స్‌ను రిఫ్రెష్ చేయండి.
* సేవ్ చేసుకున్న కాంటాక్ట్ (7349389104)ను ఓపెన్ చేసి ట్రైన్ లైవ్ స్టేటస్ కోసం ట్రైన్ నెంబర్‌ను, పీఎన్ఆర్ స్టేటస్ కోసం పీఎన్ఆర్ నెంబర్‌ను మెసేజ్ చేయండి.
* అనంతరం MakeMyTrip మీకు అప్‌డేటెడ్ ట్రైన్ లైవ్ స్టేటస్, పీఎన్ఆర్ స్టేటస్‌ను పంపిస్తుంది.
కాంటాక్ట్ రిఫ్రెష్ కొరకు:
* వాట్సాప్ ఓపెన్ చేసి, కుడివైపు చివర ఉన్న 'న్యూ మెసేజ్' ఐకాన్‌ను క్లిక్ చేయండి.
* ఇప్పుడు, పైవైపున కుడివైపు చివర ఉన్న మూడు నిలువు చుక్కలపై టాప్ చేసి రిఫ్రెష్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
గుర్తుపెట్టుకోవలసినవి:
* MakeMyTrip మీరు పంపించిన మెసేజ్‌ను చూసుకోనంతవరకు (బ్లూ టిక్ మార్క్) స్పందించదు.
* ప్రతిస్పందన సమయం కూడా విచారణల సంఖ్య లేదా సర్వర్ లోడ్‌పై ఆధారపడి ఉంటుంది.