Manchu Vishnu Comments: ఏపీ సీఎం అతనే, పవన్ కళ్యాణ్‌పై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

Manchu Vishnu Comments: ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపీలో మరోసారి అధికారం ఎవరిదనే విషయంపై ఎవరి అంచనాలు వారికున్నాయి. ఎవరి విశ్లేషణలు వారు చేస్తున్నారు. అదే సమయంలో మా అధ్యక్షుడు, టాలీవుడ్ నటుడు మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 17, 2023, 02:29 PM IST
Manchu Vishnu Comments: ఏపీ సీఎం అతనే, పవన్ కళ్యాణ్‌పై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

Manchu Vishnu Comments: ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటనే ప్రశ్నకు మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పవన్ కళ్యాణ్ సక్సెస్ సాధిస్తారా లేదా అని చెప్పేందుకు తాను రాజకీయ నాయకుడినీ కాను...పోతులూరి వీరబ్రహ్మం కూడా కాదని మంచు విష్ణు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మోహన్ బాబు తనయుడిగా సినిమాల్లో ప్రవేశించిన మంచు విష్ణు ఇటీవలి కాలంలో పెద్దగా సినిమాలు చేయడం లేదు. అతని సినిమాల్లో ఒడిదుడుకులు ఎక్కువే ఉన్నాయి. ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా అధ్యక్షుడిగా ఉన్న మంచు విష్ణు ఏపీ రాజకీయాల గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. ఏపీలో 2024లో జరిగే ఎన్నికలు ఎలా ఉండనున్నాయి,. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటనే విషయంపై మంచు చేసిన వ్యాఖ్యలు చర్యనీయాంశంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన బాగుందని, ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకంతో చాలామంది పేదలు లబ్దిపొందుతున్నారని ప్రశంసించారు. 2024 ఎన్నికల్లో సైతం ముఖ్యమంత్రి జగన్ అని తేల్చిచెప్పారు. ఇటీవలి కాలంలో వివిధ జాతీయ ఛానెళ్లు జరిపిన సర్వేల్లో కూడా ఇదే తేలిందన్నారు. 

మరోవైపు జనసేన, తెలుగుదేశం గురించి కూడా స్పందించారు. ఆ రెండు పార్టీల గురించి తనకేమీ తెలియదన్నారు. పవన్ కళ్యాణ్ సక్సెస్ అవుతారా లేదా అనేది చెప్పేందుకు తానేమీ రాజకీయ నాయకుడు లేదా పోతులూరి బ్రహ్మం కాదన్నారు. నిస్సందేహంగా పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అని..నటుడిగా అతని సామర్ధ్యమేంటో అందరికీ తెలుసన్నారు. కానీ రాజకీయాల్లో అతని పరిస్థితి గురించి తానేమీ చెప్పలేనన్నారు. పవన్ కళ్యాణ్ గురించి చెప్పలేనంటూనే పరోక్షంగా జరిగేదేంటో చెప్పేశారు మంచు విష్ణు. పరోక్షంగా చిరంజీవి పార్టీ గురించి కూడా వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తెలివైనవారని, సినిమాలు చూసినంత మాత్రాన ఓట్లు వేయరన్నారు. చాలామంది సినీరంగ మహానుభావాలు రాజకీయాల్లో రాణించలేదని..ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. 

పవన్ కళ్యాణ్ రాజకీయంగా సక్సెస్ సాధిస్తారా లేదా చెప్పేందుకు తానేమీ పోతులూరి బ్రహ్మం కాదని చెప్పిన మంచు విష్ణు మళ్లీ ముఖ్యమంత్రి జగనే అని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్‌కు ఓటమి తప్పదని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. ఇప్పుడు ఎవరు ఎంత మాట్లాడుకున్నా ఎన్నికలు వచ్చేసరికి ఎవరికి ఓటేయాలో ఎవరికి ఓటేయకూడదో ప్రజలు ఆ సమయంలో తేలుస్తారన్నారు. ఓవైపు పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అంటూనే రాజకీయాల్లో మాత్రం కాదని పరోక్షంగా చురకలు అంటించేశారు. అందుకే మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. 

Also read: Timesnow Survey: ఏపీలో ఈసారి అధికారం ఎవరిది, కేంద్రం పరిస్థితేంటి , సంచలనం రేపుతున్న మరో సర్వే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News