Reduce Belly Fat And Weight Loss: శరీర బరువు తగ్గించుకోవడం ఎంతో కష్టంతో కూడుకున్న పని..ఊబకాయం సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు గంటల తరబడి వ్యాయామాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆహారాలను డైట్ పద్ధతిలో తీసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ శరీర బరువును తగ్గించుకోలేకపోతారు. అయితే చాలా మంది డైట్ పద్ధతుల్లో ఆహారాలు తీసుకునే క్రమంలో రాత్రి పూట అతిగా తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్లే సరైన ఫలితాలు పొందలేకపోతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే రాత్రి భోజనం చేసిన తర్వాత ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ వేగంగా పెరిగి బరువు కూడా నియంత్రణలో ఉంటుందట. అయితే ఈ డ్రింక్ ఏంటో, వీటిని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వేగంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు రాత్రి ఈ డ్రింక్స్ తాగండి:
పసుపు పాలు:
పసుపు పాలకు ఆయుర్వేదంలో ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. ఈ పాలలో అధిక పరిమాణంలో ప్రొటీన్లు, కాల్షియం లభిస్తాయి. కాబట్టి సులభంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఈ పాలను తాగడం వల్ల సులభంగా, ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి ఊబకాయాన్ని, బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవాలనుకునేవారు తప్పకుండా పసుపు పాటు ట్రై చేయండి.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
మెంతి టీ:
మెంతికూరలో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు క్రమం తప్పకుండా మెంతి కూరను తీసుకుంటారు. అయితే మెంతి గింజలు కూడా శరీరానికి ఔషధంగా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారికి ప్రభావంతంగా సహాయపడుతుంది. ఈ గింజలను ఒక గ్లాసు నీటిలో కలుపుకుని..రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
దాల్చిన చెక్క టీ:
దాల్చిన చెక్కలో కూడా చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి తెలిసిన వారు ప్రతి రోజు దీనిని ఆహారాల్లో వినియోగిస్తారు. రాత్రి పడుకునే ముందు దాల్చిన చెక్క టీ తాగితే, ఎంతటి కొలెస్ట్రాల్ అయిన సులభంగా కరుగుతుంది. అంతేకాకుండా తీవ్ర పొట్ట సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే ఇందులో ఉండే గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి