Top 5 Best Selling MPV: ఇన్నోవా, క్యారెన్స్‌లను వెనక్కి నెట్టేసిన 7 సీటర్ ఇదే, ధర ఎంత, ఫీచర్లు ఎలా ఉన్నాయి

Top 5 Best Selling MPV: దేశంలో గత కొద్దికాలంగా ఎస్‌యూవీ, ఎంపీవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. 7 సీటర్ కార్ల విక్రయాలు జోరందుకుంటున్నాయి. సెడాన్ కంటే ఎస్‌యూవీ, ఎంపీవీ కార్లకు ఆదరణ పెరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 26, 2023, 07:47 AM IST
Top 5 Best Selling MPV: ఇన్నోవా, క్యారెన్స్‌లను వెనక్కి నెట్టేసిన 7 సీటర్ ఇదే, ధర ఎంత, ఫీచర్లు ఎలా ఉన్నాయి

Top 5 Best Selling MPV: దేశంలోని కార్ మార్కెట్‌లో రారాజు ఇప్పటికి మారుతి సుజుకినే. దేశ ప్రజలకు ఓ నమ్మకమైన బ్రాండ్. తక్కువ మెయింటెనెన్స్, నాణ్యత, రీసేల్ విలువ ఎక్కువగా ఉండటం ఓ కారణం. బహుశా అందుకే 7 సీటర్, ఎస్‌యూవీ విక్రయాల్లో కూడా మారుతి సుజుకి కార్లే అగ్రస్థానంలో నిలుస్తున్నాయి.

ఎంపీవీ కార్ల సెగ్మెంట్ విషయానికొస్తే దేశంలో ఎర్టిగా, ఇన్నోవా, క్యారెన్స్ కార్లకు డిమాండ్ అధికంగా ఉంది. గత కొద్దికాలంగా ఎర్టిగా ఒక్కసారిగా విక్రయాలు పెంచుకుంది. అన్నింటికంటే ముందజంలో ఉంది. అమ్మకాల్లో ఇన్నోవా, క్యారెన్స్‌లను దాటేసింది. టాప్ సెల్లింగ్ ఎంపీవీగా నిలుస్తోంది. మారుతి సుజుకి ఎర్టిగా జూలై నెలలో అత్యధికంగా విక్రయమైన 7 సీటర్ కారుగా నిలిచింది. అత్యధికంగా విక్రయమైన టాప్ 5 కార్లలో స్థానం సంపాదించుకుంది. జూలై 2023లో 14,352 యూనిట్లు విక్రయాలు నమోదు చేసింది. గత ఏడాది జూలైలో ఎర్టిగా 9,694 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూలై నాటికి 48 శాతం పెరిగింది.

వెనుకబడిన ఇన్నోవా, క్యారెన్స్

మారుతి ఎర్టిగా అనేది ఓ ఎంపీవీ. ఎంపీవీ మార్కెట్‌లో ఇన్నోవా, క్యారెన్స్ రెండూ పోటీ పడుతుంటాయి. కానీ ఈ రెండింటితో పోలిస్తే ఎర్టిగా ధర తక్కువ. అందుకే విక్రయాల్లో ఈ రెంటినీ దాటేసింది. జూలై 2023లో టొయోటా ఇన్నోవా హైక్రాస్, క్రిస్టా అమ్మకాలు 8,935 యూనిట్లు.  గత ఏడాది జూలైలో మొత్తం ఇన్నోవా రెండు మోడల్స్ విక్రయాలు కలిపి 6,900 యూనిట్లు కాగా గత ఏడాదితో పోలిస్తే 29 సాతం వృద్ధి నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. విక్రయాల విషయంలో ఇన్నోవా తరువాత కియా క్యారెన్స్ ఉంటుంది. 2023 జూలైలో ఈ మోడల్ కారు 6,002 యూనిట్లు అమ్మకాలు నమోదు చేసింది. గత ఏడాది జూలైలో 5,978 యూనిట్లు అమ్మకాలయ్యాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే పెద్దగా వృద్ధి కన్పించలేదు.

మారుతి ఎర్టిగా ధర, ఫీచర్లు ఇలా

మారుతి ఎర్టిగా ధర 8.64 లక్షల నుంచి ప్రారంభమై 13.08 లక్షల వరకూ ఉంటుంది. ఇది 1.5 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తోంది. ఇందులో మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ కూడా ఉంది. ఇందులో పెట్రోల్ ఇంజన్ 103 పీఎస్, 136.8 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులోనే సీఎన్జీ వేరియంట్ 88 పీఎస్, 121.5 ఎన్ఎం టార్క్ సామర్ధ్యం కలిగి ఉంది. సీఎన్జీ అయితే లీటర్‌కు 26 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇందులో 5 స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్ స్టాండర్డ్ , 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉన్నాయి.

Also read: Honda Elevate vs Hyundai Creta: క్రెటా పని అయిపోయినట్లేనా ? లాంచ్‌ కాకముందే కొత్త SUV కి భారీ సంఖ్యలో బుకింగ్స్

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News