Udayanidhi Remarks: తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశమంతా దుమారం రేపుతున్నాయి. నాడు యూదుల్ని అభివర్ణించిన హిట్లర్ తో స్టాలిన్ ను పోలుస్తున్నారు. మరోవైపు స్టాలిన్ తల నరికితే 10 కోట్ల నజరానా ఇస్తామంటున్నారు. అటు స్టాలిన్ కూడా విమర్శలకు దీటుగా సమాధానమిస్తున్నారు.
తమిళనాడులో ప్రోగ్రెసివ్ రైటర్స్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సనాతన నిర్మూలన అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిది స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం అనేది డెంగ్యూ, మలేరియా లాంటి ఓ రోగమని..దీనిని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరముందని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. సనాతనం అనేది సమాజానికి వ్యతిరేకమని దీనిని వ్యతిరేకించడం ఒక్కటే సరిపోదని పూర్తిగా నిర్మూలించాలని మంత్రి స్టాలిన్ కోరారు.
ఈ వ్యాఖ్యలపై దేశమంతా దుమారం రేగుతోంది. హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఓ సుప్రీంకోర్టు న్యాయవాది ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. బీజేపీ నేతలు, ఇతర ప్రముఖులు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. ఉదయనిది స్టాలిన్ వ్యాఖ్యలపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. నాడు యూదులను హిట్లర్ ఎలా అభివర్ణించారో ఇప్పుడు స్టాలిన్ అలా ప్రవర్తిస్తున్నారని బీజేపీ విమర్శిస్తోంది. స్టాలిన్ వ్యాఖ్యలు ఇండియాలో 80 శాతమున్న జనాభా మారణ హోమానికి పిలుపిచ్చినట్టేనని బీజేపీ మండిపడుతోంది. కేంద్రమంత్రి అమిత్ షా ఇతర నేతలు కూడా మండిపడ్డారు.
ఈ క్రమంలో ఉదయనిధి స్టాలిన్ తల నరికి తెచ్చినవారికి 10 కోట్లు బహుమతి ఇస్తానని, ఎవరూ ఆ పని చేయలేకపోతే తానే చంపుతాని పరమహంస ఆచార్య అనే అయోధ్యకు చెందిన ఓ సన్యాసి పిలుపివ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పరమహంస చేసిన ఈ వ్యాఖ్యల్ని చాలా వ్యంగ్యాత్మక రీతిలో ఉదయనిధి స్టాలిన్ తిప్పికొట్టారు.
తన తల తీసేందుకు పది కోట్ల రూపాయలు ఇస్తానంటున్నారని..కానీ తల దువ్వుకునేందుకు పది కోట్లెందుకు, పది రూపాయల దువ్వెన సరిపోతుందని వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. తమిళంలో చాప్, స్లైస్ అనే పదాలకు జుట్టు దువ్వడమనే అర్ధం ఉన్నందున ఉదయనిధి ఇలా సమాదానమిచ్చారు. ఇలాంటి బెదిరింపులు తమకు కొత్తేమీ కాదని భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Also read: Heavy Rains Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Udayanidhi Remarks: దుమారం రేపుతున్న సనాతనం వ్యాఖ్యలు, పది కోట్ల నజనారా