Clove Oil For Tooth Pain Relief: ఒక మనిషికి పట్ట పగలే చుక్కలు చూపించే అనారోగ్య సమస్య ఏదైనా ఉందా అంటే అలాంటి సమస్యల జాబితాలో పంటి నొప్పి కూడా ముందుంటుంది. ఔను, పంటి నొప్పి బాధించడం మొదలుపెడితే ఇక ఏమీ తోచదు. చేసే పనిపై ధ్యాస ఉండదు... ఎంత ప్రయత్నించినా చేసే పనిలో ఏకాగ్రత కుదరనివ్వదు. దంతాల్లో పుప్పి కారణంగా కానీ లేదా ఇతర కారణాల వల్ల కానీ పంటి నొప్పితో బాధపడిన వారికి ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. మరి ఒక వ్యక్తిని అంతలా వేధించే ఈ పంటి నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు ఒక ఈజీ చిట్కా ఉంది అంటే నమ్ముతారా ? అది కూడా మీ వంటింట్లోనే పంటి నొప్పికి సరైన ఔషదం దాగి ఉంది. అదేంటో తెలుసుకుందాం.
ఎన్నో ఏళ్లుగా పంటి నొప్పికి లవంగం ఒక దివ్యమైన ఔషదంగా పనిచేస్తూ వస్తోంది. టూత్ పేస్ట్ తయారీలోనూ లవంగాలు ఉపయోగిస్తారు అంటే పంటి నొప్పి నుండి ఉపశమనానికే కాదు.. దంతాలను ఆరోగ్యంగా ఉంచడంలోనూ లవంగం ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
లవంగం నుండి తీసిన నూనెతో పంటి నొప్పికి చెక్ పెట్టొచ్చు. ఎందుకంటే లవంగం నూనెలో యుగెనాల్ అనే ఒక మూలకం ఉంటుంది. అంతేకాకుండా యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడంట్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి పంటి నొప్పిని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. యుగెనాల్ అనేది సహజ సిద్ధమైన యాంటిసెప్టిక్ లాంటిది. ఇది మీ నోట్లో కానీ లేదా పుప్పి పళ్లలో కానీ ఉన్న క్రిములతో పోరాడుతుంది.
ఎలా అప్లై చేయాలంటే..
లవంగం నూనెతో పంటి నొప్పి తగ్గించవచ్చు సరే కానీ ఇంతకీ ఈ లవంగం నూనెను ఎలా అప్లై చేయాలి అని కొంతమందికి సందేహం రావచ్చు. ఒక చిన్న పుల్ల లాంటి దానికి చివరన దూది చుట్టి.. ఆ దూదిని లవంగం నూనెలో ముంచి తీయాలి. ఆ దూదిని ఎక్కడైతే నొప్పిగా ఉందో.. ఆ పంటిపైన 5 నుండి 10 వరకు పెట్టాలి. అలా ప్రతీ 2 లేదా మూడు గంటలకు ఒకసారి లవంగం నూనెలో తీసిన దూదిని నొప్పిగా ఉన్న చోట పెట్టడం వల్ల లవంగం నూనెలోని యుగెనాల్ నొప్పికి కారణమైన క్రిములతో పోరాడి వాటిని నశింపజేస్తుంది. ఫలితంగా పంటి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇది కూడా చదవండి : Foods For Weight Loss: ఖాళీ కడుపుతో ఇవి తింటే అధిక బరువు ఇట్టే తగ్గుతారు
ఒకవేళ మీకు లవంగం నూనె అందుబాటులో లేకపోతే.. ఒక లవంగాన్ని తీసుకుని దానిని కొద్దిగా నమిలి ఆ రసాన్ని, అలాగే ఆ లవంగాన్ని కొద్దిసేపు నొప్పిగా ఉన్న చోట పెట్టినట్టయితే.. పంటి నొప్పి హుష్‌కాకి అవుతుంది.
ఇది కూడా చదవండి : Weight loss Drink: కొబ్బరి నీళ్లలో ఈ గింజలు కలిపి చూడండి, అద్బుతమే ఇక
(గమనిక: ఇక్కడ పేర్కొన్న వివరాలు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటాయి. వీటిని స్వీకరించడానికి ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిని ZEE NEWS ధృవీకరించడంలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి