Happy Birthday Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ బర్త్ డే స్పెషల్.. కాలేజీ రోజుల్లో ప్రేమ ఇలా..!

Suryakumar Yadav Birthday Special: టీమిండియా నయా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ నేడు (సెప్టెంబర్ 14) తన 33వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. భారత జట్టులోకి లేటుగా ఎంట్రీ ఇచ్చిన తన అద్భుతమైన ఆటతీరుతో మైమరిపిస్తున్నాడు. ముఖ్యంగా టీ20ల్లో సూర్య మెరుపులకు ప్రత్యర్థి బౌలర్లు బెంబేలెత్తిపోతున్నారు. 
 

  • Sep 14, 2023, 16:27 PM IST
1 /5

ఈ సీజన్‌ ఐపీఎల్‌లో సూర్యకుమార్ యాదవ్ 200-ప్లస్ స్ట్రైక్ రేట్‌తో నాలుగుసార్లు యాభై-ప్లస్ స్కోర్‌లను సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.   

2 /5

ఓవరాల్‌గా ఈ ఐపీఎల్‌లో 180-ప్లస్ స్ట్రైక్ రేట్‌తో 600 ప్లస్ పరుగులు చేసిన ఏకైక భారతీయ ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు.   

3 /5

నాన్ ఓపెనర్‌గా టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ రికార్డు సృష్టించాడు. 2022లో నాటింగ్‌హామ్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 117 పరుగులతో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.   

4 /5

2022లో ఒక సంవత్సరంలో 1,000-ప్లస్ టీ20 పరుగులు చేసిన ఏకైక టీమిండియా ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. ఒక సంవత్సరంలో అత్యధిక టీ20 సిక్సర్లు (68) బాదిన ఆటగాడిగానూ నిలిచాడు.  

5 /5

పర్సనల్ లైఫ్‌ విషయానికి వస్తే.. దేవిషా శెట్టి, సూర్యకుమార్ యాదవ్ కాలేజీ రోజుల్లో ప్రేమలో పడ్డారు. ఆ తరువాత దేవిషా-సూర్య జూలై 7, 2016న వివాహం చేసుకున్నారు.