/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌ ఫైనల్ మ్యాచ్‌లో చీటింగ్ ఆరోపణలు వచ్చాయి. నవోమి ఒసాకా(జపాన్)తో టైటిల్ పోరులో.. ప్లేయర్ బాక్స్ నుంచి అమెరికా కోచ్ పాట్రిక్ మొరటొగ్లు నుంచి సెరెనాకు ఆటతీరుపై సంకేతాలు వచ్చినట్లు ఛైర్ అంపైర్ కార్లోస్ రామోస్ గమనించి వార్నింగ్ ఇచ్చాడు.

దీంతో స్టేడియం సెరినా విలియమ్స్ అభిమానులు అరుపులు, కేకలతో హోరెత్తిపోయింది. అయినా తన నిర్ణయం సరైనదేనని అంపైర్ అన్నారు. సెరీనాకు పెనాల్టి విధించారు. దీంతో 'నేను ఓడిపోతాను.. కానీ జీవితంలో మోసం చేయను. మీరు నా క్షమాపణ పొందాలి. పురుషాధిక్యం వద్దు' అని అంపైర్‌కు తెలిపింది. అయితే కోచ్ సంకేతాలిస్తున్నాడని కొందరు వీడియో ఫుటేజీలు పోస్టు చేశారు.

అటు చరిత్రలో తొలిసారి ఓ జపాన్ క్రీడాకారిణి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను గెల్చుకుంది. యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేతగా జపాన్‌కు చెందిన క్రీడాకారిణి నవోమి ఒసాకా నిలిచింది. ఫైనల్‌లో అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌పై  6-2, 6-4 తేడాతో ఒసాకా గెలుపొందింది. దాంతో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించిన తొలి జపాన్‌ క్రీడాకారిణిగా ఒసాకా రికార్డు సృష్టించింది.

 

యూఎస్‌ ఓపెన్‌లో నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్‌ మ్యాచ్‌

యూఎస్‌ ఓపెన్‌లో ఆదివారం పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఫైనల్‌లో అర్జెంటీనా స్టార్‌ వరల్డ్‌ నెం.3 ఆటగాడు జువాన్‌ మార్టిన్‌ డెల్‌పొట్రో, సెర్బియాకు చెందిన వరల్డ్‌ నెం.6 ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌లు తలపడనున్నారు.

Section: 
English Title: 
US Open: Serena Williams says she’s ‘not a cheat’, accuses tennis of sexism
News Source: 
Home Title: 

యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో చీటింగ్ వివాదం

యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో చీటింగ్ జరగలేదు: సెరెనా విలియమ్స్‌
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో చీటింగ్ వివాదం
Publish Later: 
No
Publish At: 
Sunday, September 9, 2018 - 10:48