Peddha Kapu 1: ఓటీటీలోకి వచ్చేసిన 'పెదకాపు 1'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Peddha Kapu 1: ఈ మధ్య విలేజ్  బ్యాక్ డ్రాప్‍లో తెరకెక్కిన సినిమాలు అవార్డులతోపాటు కలెక్షన్లు కూడా కొల్లగొడుతున్నాయి. తాజాగా ఇలాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా పెదకాపు 1. తాజాగా ఈ మూవీ ఓటీటీ ఎంట్రీకి సిద్దమైంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2023, 12:07 PM IST
Peddha Kapu 1: ఓటీటీలోకి వచ్చేసిన 'పెదకాపు 1'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Peddha Kapu 1 on OTT:  నారప్ప తర్వాత శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన మూవీ పెదకాపు 1. విరాట్ కర్ణ, ప్రగతి టైటిల్ రోల్స్ లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో బ్రిగిడ సాగ హీరోయిన్‍గా చేసింది. ఇందులో రావు రమేష్, రాజీవ్ కనకాల, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషించారు. ఇందులో విలన్‍గా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల నటించారు. సెప్టెంబర్ 29న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు మిక్సడ్ టాక్ వచ్చింది. దీంతో ఈ మూవీ కలెక్షన్లను రాబట్టడంలో పూర్తిగా విఫలమైంది.

అయితే ఈ మూవీ తాజాగా ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అక్టోబరు 27న అర్ధరాత్రి నుంచి ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్ లో నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీ ఆడియెన్స్ ను ఎలా మెప్పిస్తుందో చూడాలి. ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తొలి పార్టే  డిజాస్టర్ అవ్వడంతో మరి సీక్వెల్ సంగతి ఏమవుతుందోనన్న సందేహం అందరిలో నెలకొంది. గతంలో కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నారప్పలాంటి  సూపర్ హిట్ సినిమాలు తీసిన శ్రీకాంత్.. ఇలాంటి సినిమాను తీయడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Also Read: Skanda OTT: ఓటీటీ లవర్స్ కు బ్యాడ్‌ న్యూస్‌.. స్కంద డిజిటల్ స్ట్రీమింగ్‌ వాయిదా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News