Chandramohan Career: చంద్రమోహన్ 50 ఏళ్ల సినీ ప్రస్థానం ఎలా సాగింది..? నటించిన సినిమాలేవి

Chandramohan Career: టాలీవుడ్ పరిశ్రమకు తీరనిలోటు. తీవ్ర విషాదం నెలకొంది. పాతకాలం, నేటి కాలం అందర్నీ అలరించిన చంద్రమోహన్ మరణించారు. 5 దశాబ్దాలకు పైగా సాగిన చంద్రమోహన్ సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 11, 2023, 12:45 PM IST
Chandramohan Career: చంద్రమోహన్ 50 ఏళ్ల సినీ ప్రస్థానం ఎలా సాగింది..? నటించిన సినిమాలేవి

Chandramohan Career: టాలీవుడ్‌లో అన్ని తరాలకు తన నటనతో ఆకట్టుకుంటున్న 80 ఏళ్ల చంద్రమోహన్ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1966లో రంగులరాట్నం సినిమాతో తెరంగేట్రం చేసిన చంద్రమోహన్ సినీ ప్రస్థానం ఇలా సాగింది. 

ఏపీలోని కృష్ణా జిల్లా పమిడిముక్కల గ్రామంలో 1943 మే 23న జన్మించిన మల్లంపల్లి చంద్రశేఖర్ రావు అలియాల్ చంద్రశేఖర్‌కు చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి ఎక్కువ. నాటకాలు ప్రదర్శించేవాడు. దిగ్గజ దర్శక నిర్మాత బీఎన్ రెడ్డి దృష్టిలో పడ్డ తరువాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. రంగులరాట్నం హిట్ అయినా హైట్ సమస్య కావడంతో పూర్తి స్థాయిలో హీరోగా స్థిరపడలేకపోయారు. అయితే నాటి తరం, నేటి తరంతో పాటు మధ్య తరం హీరో హీరోయిన్లతో నటించిన అనుభవముంది. చంద్రమోహన్ సరసన నటించిన శ్రీదేవి, జయసుధ, జయప్రద, వాణిశ్రీ, విజయశాంతిలు స్టార్ హీరోయిన్స్ అయ్యారు. కళాతపస్వి కే విశ్వనాధ్‌తో బంధుత్వం ఉంది. 

పదహారేళ్ల వయస్సు సినిమాతో  డీ గ్లామర్ రోల్‌తో అద్భుతంగా అందర్నీ ఆకట్టుకున్నారు. 50 ఏళ్లకు పైగా సాగిన చంద్రమోహన్ దాదాపు అన్ని రకాల పాత్రలు పోషించారు. చంద్రమోహన్ తన సినీ జీవితంలో రెండు ఫిలిం ఫేర్ అవార్డులు, 6 నంది అవార్డులు గెల్చుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌లతో పాటు సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరరావు, మహేశ్ బాబు, కృష్ణ, ప్రభాస్, కృష్ణంరాజు, గోపీచంద్ ఇలా అందరితో నటించాడు. 

చంద్రమోహన్ నటించిన సినిమాలు

బంగారు పిచుక, ఆత్మీయులు, తల్లిదండ్రులు, బొమ్మబొరుసు, రామాలయం, కాలం మారింది, జీవన తరంగాలు, అల్లూరి సీతారామరాజు, ఓ సీత కథ, యశోద కృష్ణ, సెక్రటరీ, పాడిపంటలు, కురుక్షేత్రం, ఖైదీ కాళిదాసు, దేవతలారా దీవించండి, ప్రాణం ఖరీదు. సీతామాలక్ష్మి, శంకరాభరణం, తాయారమ్మ, బంగారయ్య, ఇంటింటి రామాయణం, కొరికలే గుర్రాలైతే, మంగళ తోరణాలు, సంఘం చెక్కిన శిల్పాలు, నాగమల్లి, గయ్యాయళి గంగమ్మ, శుభోదయం, పక్కింటి అమ్మాయి, ప్రియ కలహాల కాపురం.

Also read: Unknown Facts About Chandra Mohan: చంద్రమోహన్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..ఆయనకు గుర్తింపు తెచ్చిన సినిమా ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x