Bathroom tips:ఇల్లు మొత్తం క్లీన్ చేయడం ఒక ఎత్తు అయితే టాయిలెట్స్ క్లీన్ చేయడం మరొక ఎత్తు. ఎంత శుభ్రం చేసినా కొన్నిసార్లు టాయిలెట్స్ లో ముందుగా పేరుకుపోయిన జిడ్డు ,మురికి పోవు. టాయిలెట్ క్లీన్ చేయాలంటే ఎవరికైనా ఎంతో కష్టంతో కూడుకున్న పని. పైగా ఇందులో ఎక్కువగా డర్టీల ఫామ్ అవుతుంది కాబట్టి సరిగా శుభ్రం చేయకపోతే మళ్లీ మనకే 10 రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది.
అయితే బాత్ రూమ్స్క్రీన్ చేయడానికి మార్కెట్లో చాలా ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉన్నప్పటికీ వాటి ఘాటు వాసన అందరికీ పడదు. ఆ వాసన పిలుస్తూ టాయిలెట్ క్లీన్ చేయాలి అంటే పెద్ద తలనొప్పి తో కూడుకున్న పని. యాసిడ్ వాడాలన్నా చాలా కష్టం. అందుకే ఈ రెండు పౌడర్స్ మీరు ఇంట్లో పెట్టుకోగలిగితే ఎప్పుడు కావాలంటే అప్పుడు బాత్ రూమ్ పెద్ద శ్రమ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు. మరి ఆ ఈజీ ట్రిక్ ఏమిటో తెలుసుకుందాం పదండి..
చాలా సందర్భాలలో టాయిలెట్ పాట్‌లో అక్కడక్కడ పసుపు రంగులో మచ్చలు ఏర్పడతాయి. అవి అంత సులభంగా పోవు కూడా. అటువంటి మచ్చలు ఏర్పడిన ప్రదేశంలో కాస్త డిటర్జెంట్ పౌడర్ వేసి బాగా స్క్రబ్ చేసి అలాగే రాత్రంతా వదిలేయండి. అలా నైట్ మొత్తం బాత్ రూమ్ ఖాళీగా ఉంచడం కుదరదు అనుకున్న వాళ్లు పొద్దున ఎప్పుడన్నా అలా చేసి వదిలేసి ఒక 2 అవర్స్ తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. డిటర్జెంట్ బాగా నానిన తర్వాత కొంచెం నీళ్లు పోసి బ్రష్ తో బాగా స్క్రబ్ చేసి నీట్ గా కడిగేస్తే టాయిలెట్ కొత్త దానిలా మెరిసిపోతుంది.
మనం రెగ్యులర్ గా వాడే డిటర్జెంట్ పౌడర్ లైమ్ స్కేల్, హార్డ్ వాటర్ స్తైన్స్ పై కూడా పనిచేస్తాయి. అందుకే వీటిని టాయిలెట్ క్లీన్ చేయడానికి వాడవచ్చు. బాత్ రూమ్ లో ఎక్కువగా దుర్వాసన వస్తూ ఉంటే మీ ఫ్లష్ ట్యాంక్ లో ఒక చిన్న టూత్ పేస్ట్ టూబ్ కి హోల్స్ పెట్టి అందులో ఉంచండి. మీరు ఫ్రెష్ కొట్టినప్పుడల్లా టూత్ పేస్ట్ లోని ఫ్లేవర్ వాటర్ లో కలిసి ట్యాంక్ ఫ్రెష్ గా ఉంటుంది. టాయిలెట్ పాట్ క్లీన్ చేయడానికి రెండు గ్లాసుల వైట్ వెనిగర్ కి ఒక గ్లాస్ నీటిని కలిపి అందులో రెండు స్పూన్ల డిష్ వాష్ లిక్విడ్ వేయాలి. ఈ మిశ్రమాన్ని పాట్ పై వేసి బాగా స్క్రబ్ చేసి పది నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత మెల్లిగా స్క్రబ్ చేసి క్లీన్ చేస్తే చాలు.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించింది. ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించండి .
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Bathroom hack:ఈ పౌడర్ ఒక్క స్పూన్ .. మీ టాయిలెట్ ని కొత్తదానిలా మార్చేస్తుంది..