Telangana New CM Oath Ceremony Live Updates: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ మూడో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీ స్డేడియంలో రూట్‌మ్యాప్, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. స్డేడియంలో ఎవరు ఎటు నుంచి లోపలకు వెళ్లాలి..? నగరంలో ట్రాఫిక్ ఎటు మళ్లించారనే వివరాలు ఇప్పటికే పోలీసులు వెల్లడించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఎల్బీ స్డేడియం చుట్టుపక్కల 3 వేలమందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.