Telangana Ministers: తెలంగాణ కొత్త మంత్రుల జాబితా ఇదే.. ఆయనే డిప్యూటీ సీఎం..!

Telangana Cabinet List Released: తెలంగాణ కొత్త మంత్రుల జాబితా విడుదలైంది. రేవంత్ రెడ్డితోపాటు మరో 11 మంది మంత్రుల జాబితాను రాజ్‌భవన్‌కు అందించారు కాంగ్రెస్ నేతలు. రేవంత్ రెడ్డితోపాటు వీరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Dec 7, 2023, 10:34 AM IST
Telangana Ministers: తెలంగాణ కొత్త మంత్రుల జాబితా ఇదే.. ఆయనే డిప్యూటీ సీఎం..!

Telangana Cabinet List Released: మరికొన్ని గంటల్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేవంత్ రెడ్డితోపాటు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల జాబితా కూడా విడులైంది. తెలంగాణ కేబినెట్‌లో చోటు కల్పించిన మంత్రుల జాబితాను రాజభవన్‌కు కాంగ్రెస్ నేతలు అందించారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహలు కాసేపట్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు మిగతా మంత్రులంతా ఉ. 11 గంటలకల్లా ఎల్బీ స్టేడియానికి చేరుకోనున్నారు. రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు వీరంతా ప్రమాణ స్వీకారం చేస్తారు. మంత్రివర్గ జాబితాలో చోటుదక్కిన వారికి రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్‌ చేసి చెప్పారు.

రేవంత్ రెడ్డి కేబినెట్‌లో ఇద్దరు మహిళలకు చోటు దక్కింది. సీతక్క ఒకరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. కొండా సురేఖ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. ఇద్దరు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా సీనియర్ నాయకులు. ఇద్దరు కూడా ఎంపీలుగా ఉంటూ ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచారు. ఎంపీలుగా రాజీనామా చేసి ఇప్పుడు మంత్రులు ఎన్నికయ్యారు. ఉమ్మడి నల్గొండలో కాంగ్రెస్ విజయంలో వీరిద్దరిది కీలక పాత్ర.

ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి జూపల్లి కృష్ణారావుకు మంత్రివర్గంలో చోటు దక్కింది. ఆయన వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురికి కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులకు బెర్త్ కన్ఫార్మ్ అయింది. ఉమ్మడి మెదక్ నుంచి దామోరం నర్సింహ, ఉమ్మడి కరీంనగర్ నుంచి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్‌లు మంత్రులుగా ఎన్నికయ్యారు. 

Also Read:  Revanth Reddy: ఇదే నా ఆహ్వానం.. ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Also Read: Dual Votes: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో డబుల్ ఎంట్రీ ఓట్లు, ఈసీకు ఫిర్యాదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News