Maruti Suzuki Celerio: అలాంటి వాటిలో ఒకటి మారుతి సిలేరియో. మారుతి సుజుకి నుంచి వచ్చిన అన్ని కార్లు మార్కెట్‌లో హిట్ అయినా సిలేరియో మాత్రం వెనుకబడింది. కానీ ఫీచర్లు మాత్రం చాలా బాగుంటాయి. అద్భుతమైన మైలేజ్ ఇవ్వడమే కాకుండా ధర కూడా చాలా తక్కువ. ఫీచర్లు కూడా బాగుంటాయి.
దేశంలోని కారు విక్రయాల్లో ఇప్పటికీ మారుతి సుజుకిదే అగ్రస్థానం. టాప్ 10 సేల్స్‌లో మారుతి కంపెనీ కార్లే 5-6 ఉంటుంటాయి. మారుతి సుజుకి కంపెనీకు చెందిన మరో కారు మారుతి సిలేరియో అమ్మకాలపరంగా మార్కెట్‌లో క్లిక్ కాలేదు. కానీ ఈ కారు చాలా ప్రత్యేకమైందని చెప్పుకోవాలి. ఫీచర్లు బాగుంటాయి. ధర చాలా తక్కువ. మైలేజ్ చాలా ఎక్కువ ఇస్తుంది. ఆ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం..
మారుతి సిలేరియో 5 సీటర్ స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారు. ఇందులో నాలుగు మోడల్స్ ఉన్నాయి. ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్. ఇందులో సిలేరియో వీఎక్స్ఐ సీఎన్జీ వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది. సిలేరియో ధర 5.37 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ 7.14 లక్షల వరకూ ఉంటుంది. సీఎన్జీ వేరియంట్ ధర 6.74 లక్షలుంది.
మారుతి సిలేరియో ఫీచర్లు
ఇందులో 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, ప్యాసివ్ కీలెస్ ఎంట్రీ, ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్, స్టీరింగ్ వీల్ మౌంటెండ్ ఆడియో కంట్రోల్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్ ఇండికేటర్స్‌తో పాటు ఎలక్ట్రిక్ ఓఆర్వీఎమ్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, హిల్ హోల్డ్ అసిస్ట్, రేర్ పార్కింగ్ సెన్సార్ ఫీచర్లు ఉన్నాయి.
సిలేరియో ఇంజన్ ప్రత్యేకతలు
ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ పెట్రోల్ ఇంజన్ 67 పీఎస్ 89 ఎన్ఎం టార్క్ జనరేట్ చేసే సామర్ధ్యం కలిగి ఉంటుంది. అదే సీఎన్జీ వేరియంట్ అయితే 56.7 పీఎస్, 82 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. పెట్రోల్ ఇంజన్‌తోపాటు 5 స్పీడ్ మేన్యువల్, 5 స్పీడ్ ఏఎంటీ ఆప్షన్ ఉంటుంది. సీఎన్జీ వేరియంట్‌లో అయితే కేవలం 5 స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్ మాత్రమే ఉంటుంది. ఇందులో సెగ్మెంట్ ఫాస్ట్ ఆటోమేటిక్ ఐడియల్ స్టార్ట్ స్టాప్ ఉన్నాయి.
మారుతి సుజుకి సిలేరియో మైలేజ్ వింటే ఆశ్చర్య కలగకమానదు. అద్భుతమైన మైలేజ్ ఇచ్చే కారు ఇది. ఇందులో పెట్రోల్ వేరియంట్ ఎంటీ మోడల్ లీటర్‌కు 25.24 కిలోమీటర్లు ఇస్తుంది. పెట్రోల్ వేరియంట్ ఏఎంటీ మోడల్ అయితే 26.68 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇక సీఎన్జీ వెర్షన్ అయితే లీటర్‌కు 35.6 కిలోమీటర్లు ఇస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook