Roshan Kanakala: నల్లగా ఉన్నానని ఎగతాళి చేశారు…ట్రోల్స్ పై స్పందించిన సుమా కొడుకు

Bubble Gum: సుమా కొడుకు తెలుగు ఇండస్ట్రీ లోకి బ‌బుల్‌గ‌మ్ సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే న‌ల్ల‌గా ఉన్నాడు వీడు హీరో ఎంట్రా అని త‌న‌పై చాలా మంది నెగెటివ్ కామెంట్స్ చేశార‌ని నిన్న ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో రోష‌న్ క‌న‌కాల అన్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2023, 11:39 AM IST
Roshan Kanakala: నల్లగా ఉన్నానని ఎగతాళి చేశారు…ట్రోల్స్ పై స్పందించిన సుమా కొడుకు

Suma Son Speech: తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన యాంకర్ సుమ. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు లేడీ సూపర్ స్టార్ ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు సుమని. అంతేకాదు ఎంతటి స్టార్ హీరో రిలీజ్ ఈవెంట్ అయినా సుమ ఉంటేనే కళకళలాడిపోతుంది. అలాంటి సుమ కొడుకు రోషన్ కనకాల బబుల్ గమ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకి హీరోగా రాబోతున్నాడు. బ‌బుల్‌గ‌మ్ సినిమాకు క్ష‌ణం ఫేమ్ ర‌వికాంత్ పేరేపు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మాన‌స చౌద‌రి హీరోయిన్‌గా న‌టించింది

ఇక ఈ మూవీ డిసెంబ‌ర్ 29న ప్రేక్ష‌కుల ముందుకురాబోతోంది. ఇక ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఈ సినిమా  ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ నేపథ్యంలో స్కిన్ క‌ల‌ర్ విష‌యంలో త‌న‌పై వ‌స్తోన్న‌ ట్రోల్స్‌పై రోష‌న్ క‌న‌కాల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రియాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ హీరో చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.

రోషన్ మాట్లాడుతూ “మ‌స్తు క‌ర్రెగా (న‌ల్ల‌గా) ఉన్నాడు. అసలు వీడు తెలుగు హీరో ఏంటి.. అని నా గురించి చాలామంది మాట్లాడుకోవడం అలానే సోషల్ మీడియాలో ట్రోల్స్ వేయడం చూశాను.. అసలు వీడు హీరో మెటీరియ‌ల్, వీడి ముఖం బాగా లేద‌ని.. నాపై చాలామంది దారుణంగా నెగెటివ్‌ కామెంట్స్ చేశారు .. అయితే వారందరికీ ఒకటే..నేను ఇలాగే పుట్టా..ఇలాగే ఉంటా. ఒక మ‌నిషికి న‌లుపు తెలుపు...అందం కాదు. ఒక మ‌నిషి స‌క్సెస్‌ను డిసైడ్ చేసేది ఆ మ‌నిషి హార్డ్ వ‌ర్క్‌, టాలెంట్‌, డిసిప్లెన్ మాత్ర‌మే” అని రోష‌న్ క‌న‌కాల చెప్పుకొచ్చాడు.

“ఓ రోజు వ‌స్తాది. ఆ రోజు నేను వ‌ద్ద‌నుకున్నా విన‌బ‌డ‌తా. చెవులు మూసుకున్నా విన‌బ‌డ‌తా. డిసెంబ‌ర్ 29న థియేట‌ర్ల‌కు రండి. బ‌బుల్‌గ‌మ్‌లో ఈ ఆదిగాడి ల‌వ్‌ను చూడండి. గౌర‌వం కోసం ఆదిగాడు చేసే పోరాటం చూడండి” అని తన మొదటి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లోనే స్పీచ్ అదరగొట్టాడు ఈ హీరో.

 

 

ఇక త‌న‌పై వ‌స్తోన్న ట్రోల్స్‌పై రోష‌న్ క‌న‌కాల చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read: Urfi Javed And Sofia Ansari: ఉర్ఫీ జావేద్, సోఫియా అన్సారీలు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఎంత సంపాదిస్తారో తెలిస్తే..మైండ్‌ బ్లాక్‌ అవ్వుది..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News