Asthma Care: ఆస్తమా అనేది ఒక దీర్ఘకాలిక శ్వాసకోస సంబంధిత సమస్య. అలర్జీ కారణంగా వాయు నాళాలు వాపు కు గురి కావడంతో.. అవి కుంచించుకొని పోతాయి. ఇలా జరగడం వల్ల గాలి లోపలికి పోవడానికి రావడానికి కష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. మందుల ద్వారా ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే శీతాకాలంలో ఆస్తమా పేషెంట్స్ కు మరింత కష్టమనే చెప్పాలి. వాతావరణం లో ఏర్పడిన మార్పుల కారణంగా.. ఎక్కువగా ఆస్తమా లక్షణాలు ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది.
కాస్త తేలికపాటి జలుబు చేసిన వీళ్లకు ఒక పట్టాన తగ్గదు. దీంతో ఊపిరి సరిగ్గా ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. దగ్గు, ఛాతీ బిగుసుకుపోవడం, ఊపిరి ఆడక పోవడం లాంటి లక్షణాలతో వీళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడతారు. శీతాకాలంలో ఆస్తమా సమస్యలు తలెత్తకుండా కంట్రోల్ చేయడానికి మనం మన డైట్ లో తేలికపాటి మార్పులు చేసుకుంటే సరిపోతుంది. మరి ఈ సీజన్ ఆస్తమా పేషంట్స్ తీసుకోవలసిన ఫుడ్స్ గురించి తెలుసుకుందాం..
పసుపు
పసుపులో..యాంటీఇన్ఫ్లమేటరీ,యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇది మన శరీరంలో ఇన్ఫెక్షన్స్ పెరగకుండా కంట్రోల్ చేయడంలో ఎంతో తోడ్పడుతుంది. అయితే మనం కూరల్లో వాడే పసుపు సరిపోదు కాబట్టి రోజు పసుపుట్టి లేదా పసుపు కలిపిన పాలు తీసుకోవడం మంచిది.
అల్లం
కూరల్లో రుచికోసం సువాసన కోసం వాడే అల్లం ఆస్తమా పేషెంట్స్ కి ఒక ఔషధం లాంటిది. అల్లం లో మెండుగా ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు.. శ్వాసకోశ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. ఆస్తమా తో బాధపడేవారు శీతాకాలం రోజు అల్లం టీ తీసుకోవడం ఎంతో మంచిది.
ఆకు కూరలు
శీతాకాలం మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరలను భాగంగా చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఆకుకూరలు ఆస్తమా లక్షణాలను తగ్గించడంతోపాటు శీతాకాలం జీర్ణవ్యవస్థ మందగించకుండా సంరక్షిస్తాయి.
వెల్లుల్లి
ఆస్తమా లక్షణాలతో ఇబ్బంది పడే వాళ్ళు రోజు క్రమం తప్పకుండా వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి మెల్లిగా బయటపడతారు. వెల్లుల్లి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగవ్వడంతోపాటు మనకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ సోకకుండా ఉంటాయి.
కాగా ప్రస్తుతం కరోనా కేసులు కూడా ఎక్కువ అవుతూ ఉండడంతో.. మన డైట్ లో ఇవన్నీ చేర్చుకుంటే .. మన ఇమ్యూనిటీ పెరిగి కరోనా భారీ నుంచి కూడా తప్పుకునే అవకాశం ఉంది.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది.కావున ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
Also Read: Corona Jn.1 Precautions: దేశంలో కరోనా కొత్త వేరియంట్ భయం, లక్షణాలెలా ఉంటాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter