ICC ODI Cricketer of the Year 2023: ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 నామినీస్ లిస్ట్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వెల్లడించింది. మొత్తం నలుగురు ప్లేయర్లు పోటీ పడుతుండగా.. ఇందులో ముగ్గురు మన దేశం నుంచే ఎంపికవ్వడం విశేషం. టీమిండియా నుంచి విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీ రేసులో ఉండగా.. వీరితో పాటు న్యూజిలాండ్ ఆల్ రౌండర్ డారిల్ మిచెల్ కూడా పోటీలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ ఈ ఏడాది ప్రపంచకప్‌లో అద్భుత పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నారు. కోహ్లీ అత్యధిక పరుగులతో టాప్ స్కోరర్‌గా, షమీ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారు.
ఈ ప్రపంచకప్‌లో 765 పరుగులను చేసిన కింగ్ కోహ్లీ.. అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. ఒకే వన్డే ప్రపంచ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. 50 వన్డే సెంచరీలు సాధించిన మొదటి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ ప్రపంచకప్‌లోనే సచిన్ (49) అత్యధిక సెంచరీల రికార్డు కనుమరుగై పోయింది. 2023లో కోహ్లీ 72.47 సగటుతో 1,377 పరుగులు సాధించి.. ఆరు సెంచరీలతో సహా అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు షమీ 42 వికెట్లు పడగొట్టి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. ప్రపంచకప్‌లో 10.70 సగటుతో 24 వికెట్లు, మూడుసార్లు ఐదు వికెట్ల పర్ఫామెన్స్తో షమీ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
ఇక శుభ్‌మన్ గిల్ విషయానికి వస్తే.. టీమిండియా తరుఫున అన్ని ఫార్మాట్స్‌లో దుమ్ములేపుతున్నాడు. ముఖ్యంగా గతేడాది వన్డేల్లో తిరుగులేని ఫామ్‌తో అదరగొట్టాడు. ఐదు సెంచరీలతో సహా 63.36 సగటుతో 1,584 పరుగులు చేసి.. 2023 సంవత్సరానికి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా కూడా గిల్ చరిత్ర సృష్టించాడు. అయితే ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మిచెల్ నుంచి ఈ ముగ్గురు టీమిండియా స్టార్లకు గట్టి పోటీ ఎదురుకానుంది. మిచెల్ ప్రపంచకప్‌లో 69 సగటు, 111.06 స్ట్రైక్ రేట్‌తో 552 పరుగులు చేశాడు. కివీస్ సెమీస్ చేరడంలో మిచెల్ కీ రోల్ ప్లే చేశాడు. టీమిండియాతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ సెంచరీలతో చెలరేగాడు. గతేడాది మొత్తం 26 మ్యాచుల్లో 1204 పరుగులు చేశాడు.
ఐసీసీ నామినేషన్లతో గతేడాది వన్డే ఫార్మాట్లో టీమిండియా ఆధిపత్యం చెలాయించిందని తేలిపోయింది. అయితే ప్రపంచకప్‌లో అజేయంగా ఫైనల్‌కు చేరిన భారత్.. ఆసీస్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఫైనల్లో ఓటమి మినహా.. భారత్ వన్డే ఫార్మాట్లో నెంబర వన్ ర్యాంక్‌తో ఏడాదిని ముగించింది.
Also Read: Ayodhya Rammandir Features: అయోధ్య రామమందిరం ఎలా ఉంటుంది, ప్రత్యేకతలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి