Tiger 3 OTT: ఆ సీన్లతో ఓటీటీలోకి వచ్చేసిన సల్మాన్ 'టైగర్ 3'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Tiger 3 OTT Update: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌ లేటెస్ట్ మూవీ టైగర్ 3. తాజాగా ఈ మూవీ సడన్ గా ఓటీటీ ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2024, 02:13 PM IST
Tiger 3 OTT: ఆ సీన్లతో ఓటీటీలోకి వచ్చేసిన సల్మాన్ 'టైగర్ 3'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Tiger 3 OTT Release date: సల్మాన్ ఖాన్‌, కత్రీనా కైఫ్ జంటగా నటించిన చిత్రం టైగర్ 3. దీపావళి కానుకగా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. టైగర్ మూవీ సిరీస్‌లో వచ్చిన మూడో సినిమా ఇది. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్ బ్యానర్‌లో ఆదిత్య చోప్రా నిర్మించారు. రాధే, అంతిమ్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్ ఫ్లాప్స్ తర్వాత సల్మాన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై వీర లెవల్లో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహించారు. 

టైగర్ 3కు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ.. అదే జోరు తర్వాత కొనసాగించలేకపోయింది. తొలి రెండు రోజుల్లో రూ.100 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత ఈ మూవీ కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి.  సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి రూ. 14 కోట్లు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అయితే ఓటీటీ లవర్స్ మాత్రం ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురు చూశారు. 

Also Read: Captain Miller Trailer: పవర్ ప్యాక్డ్‌గా ధనుష్ ‘'కెప్టెన్‌ మిల్లర్'’ ట్రైల‌ర్

ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ పై ఎన్నో డేట్స్ వినిపించాయి. కానీ అవేం నిజం కాలేదు. అయితే సడన్ గా ఓటీటీ ఎంట్రీ ఇచ్చి సర్ ప్రైజ్ చేసింది. నేటి నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. టైగర్ సిరీస్ ఇష్టపడే ఫ్యాన్స్ కు మరో ట్రీట్ ఇచ్చారు మేకర్స్. సెన్సార్ బోర్డ్ కట్ చేసిన, డిలీట్ చేసిన సన్నివేశాలతో కలిపి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు టాక్. చాలా ఏళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సల్మాన్ కు ఇది కూడా డిజాస్టర్ గా మిగిలింది. థియేటర్లలో చూడలేకపోయిన  ఆడియెన్స్ ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. 

Also Read: Guntur Kaaram Trailer: మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఇవాళే 'గుంటూరు కారం' ట్రైలర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News