POCO M6 Pro 4G Price: AMOLED డిస్‌ప్లేతో మార్కెట్‌లోకి Poco నుంచి మరో 2 మొబైల్స్‌..ఫీచర్స్‌ అన్ని అదుర్స్‌..

POCO M6 Pro 4G Price: POCO నుంచి మార్కెట్‌లో మరో రెండు స్మార్ట్ ఫోన్స్‌ విడుదల కాబోతున్నాయి. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్స్‌ ప్రీమియం ఫీచర్స్‌తో రాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ మొబైల్స్‌కి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2024, 09:31 AM IST
POCO M6 Pro 4G Price: AMOLED డిస్‌ప్లేతో మార్కెట్‌లోకి Poco నుంచి మరో 2 మొబైల్స్‌..ఫీచర్స్‌ అన్ని అదుర్స్‌..

 

POCO M6 Pro 4G Price: POCO నుంచి సాదా బడ్జెట్‌లో మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ ఫోన్‌ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ జనవరి 11న జరిగే కంపెనీ ఆన్‌లైన్‌ ఈవెంట్‌లో భాగంగా  X6 సిరీస్, M6 ప్రో 4G స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేయబోతోంది. అయితే POCO కంపెనీ ఈ రెండు సిరీస్‌లకు సంబంధించిన స్మార్ట్‌ ఫోన్స్‌ ఫీచర్స్‌ను అధికారికంగా వెల్లడించింది. ముఖ్యంగా M6 ప్రో 4G మొబైల్‌ అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో రాబోతోందని సమాచారం. దీంతో పాటు శక్తివంతమైన కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇవే కాకుండా చాలా రకాల కొత్త ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

POCO M6 Pro 4G స్పెసిఫికేషన్:
పోకో M6 Pro 4G స్మార్ట్‌ ఫోన్‌ ప్రీమియం 120Hz AMOLED డిస్‌ప్లేతో రాబోతోంది. దీంతో పాటు కంపెనీ తొలుతయ 12GB ర్యామ్‌, 512GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది. ఇక కెమెరా విషయానికొస్తే..ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్‌ సెట్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో OISతో 64 మెగాపిక్సెల్స్‌ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 67W టర్బోచార్జింగ్ సపోర్ట్‌తో విడుదల చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది.

M6 Pro 4G ధర వివరాలు:
గతంలో కంపెనీ ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం ఈ POCO M6 Pro 4G స్మార్ట్ ఫోన్‌ Helio G99-Ultra చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది ఆండ్రాయిడ్ 13లో రన్‌ అవ్వబోతున్నట్లు సమాచారం. ఈ మొబైల్‌ 5000 mAh బ్యాటరీని కలిగి ఉంటుందని అమెజాన్ UAE లిస్టింగ్ వెల్లడించింది. అలాగే సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరాతో రాబోతున్నట్లు తెలుస్తోంది. Amazon UAE సైట్‌లో POCO M6 Pro 4G స్మార్ట్‌ ఫోన్‌ 12GB ర్యామ్‌ 512GB స్టోరేజ్ మోడల్ ధర AED 899 (సుమారు రూ. 20,300)లో అందుబాటులో ఉంది. 

Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..

POCO X6 సిరీస్ జనవరి 11న గ్రాండ్‌ ఎంట్రీ:
Poco భారతదేశంలో జనవరి 11 సాయంత్రం 5.30 గంటలకు Poco X6 సిరీస్‌ను కూడా లాంచ్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన టీజర్‌ ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్‌ అవుతోంది. దీన్ని బట్టి చూస్తే ఈ మొబైల్‌ను మొదట ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో భాగంగా POCO X6, POCO X6 ప్రో అనే రెండు మోడల్స్‌ అందుబాటులోకి రానున్నాయి. ఇందులో ప్రో మోడల్‌ MediaTek Dimension 8300 అల్ట్రా ప్రాసెసర్‌పై పని చేస్తుంది. POCO X6 ప్రో  12GB ర్యామ్‌, 512GB స్టోరేజ్ మోడల్ అమెజాన్ UAEలో AED 1299 (సుమారు రూ. 29,469)తో అందుబాటులో ఉంది.. 

Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x