Bangladesh Elections: బంగ్లా ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన స్టార్ క్రికెటర్.. ఏకంగా లక్షా యాభై వేల మెజార్టీతో..

Shakib Al Hasan: బంగ్లా సార్వత్రిక ఎన్నికల్లో ఆ దేశ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ ఎంపీగా ఘన విజయం సాధించారు. మగురా పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందాడు ఈ ఆల్ రౌండర్.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2024, 11:37 AM IST
Bangladesh Elections: బంగ్లా ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన స్టార్ క్రికెటర్.. ఏకంగా లక్షా యాభై వేల మెజార్టీతో..

Bangladesh Elections 2024 Live Updates: బంగ్లాదేశ్ కెప్టెన్ మరియు స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఎంపీగా ఎన్నికయ్యాడు. ఇన్నాళ్లు మైదానంలో తన బ్యాటింగ్, బౌలింగ్ తో ప్రత్యర్థులపై ఆదిపత్యం చెలాయించిన షకీబ్.. ఇప్పుడు ప్రజా జీవితంలో తన మార్కును చూపించడానికి రెడీ అయ్యాడు. 

36 ఏళ్ల షకీబ్ ఆదివారం జరిగిన 12వ జాతీయ ఎన్నికలలో మగురా-1 నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఇతడు"పడవ గుర్తు"తో ఎన్నికల్లో పోటీ చేశాడు. ప్ర‌ధాని షేక్ హ‌సీనా(Sheikhe Hasina)కు చెందిన అవామీ లీగ్(Awami League) త‌ర‌ఫున పోటీ చేసిన షకీబ్ లక్షా యాభై వేల మెజార్టీతో స‌మీప ప్ర‌త్య‌ర్థి అడ్వకేట్ రెజౌల్ హ‌స‌న్‌(Rezaul Hasan)పై గెలుపొందాడు. షకీబ్ కు 1,85,388 ఓట్లు రాగా.. బంగ్లాదేశ్ కాంగ్ర‌స్ పార్టీకి చెందిన హ‌స‌న్‌కు కేవ‌లం 45,933 ఓట్లు మాత్రమే ప‌డ్డాయి. పోటీ చేసిన తొలిసారే ఈ ఆల్ రౌండర్ భారీ మెజార్టీతో విజయం సాధించాడు. దీంతో ఎన్నికల్లో గెలిచిన బంగ్లా రెండో కెప్టెన్ గా షకీబ్ రికార్డు నెలకొల్పాడు. ఇతడి కంటే ముందు ముష్ర‌ఫే ముర్తాజా(Musharfe Mortaza) ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే.

ప్రపంచంలోని ఉత్తమ ఆల్ రౌండర్లలో షకీబ్ ఒకడు. అంతేకాదు మూడు ఫార్మాట్లలో అగ్ర‌స్థానంలో నిలిచిన తొలి ఆల్‌రౌండ‌ర్‌గా ష‌కీబ్ అరుదైన ఘనత సాధించాడు. షకీబ్ చివరి సారిగా వన్డే ప్రపంచకప్ 2023లో ఆడాడు. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. 300 స్థానాలకుగానూ ఆ పార్టీ ఏకంగా 200 సీట్లను గెలుచుకుంది. దీంతో షేక్ హసీనా ఐదోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈమె గోపాల్ గంజ్-3 నుంచి బరిలోకి దిగి గెలిచారు. ఇదే స్థానం నుంచి వరసుగా ఎనిమిదోసారి నెగ్గారు.

Also Read: India vs Afghanistan: 14 నెలల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న రోహిత్, కోహ్లీ.. అఫ్గాన్‌తో సిరీస్‌కు భారత జట్టు ఇదే..

Also Read: WTC Points Table: డ‌బ్ల్యూటీసీలో ఆస్ట్రేలియాకు అగ్రస్థానం.. దిగజారిన భారత్ ర్యాంక్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News