Moto G34 5G Launch: టెక్ దిగ్గజం మోటరోలా నుంచి మార్కెట్‌లోకి మరో స్మార్ట్ ఫోన్ విడుదల కాబోతోంది. కంపెనీ ఈ మొబైల్‌ను Moto G34 5G మోడల్‌తో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ మంగళవారం (ఈ రోజు) విడుదల చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ విడుదలకు ముందే కంపెనీ కొన్ని ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్స్ అధికారిక ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ మొబైల్ ఏయే ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి రాబోతుందో..దీనికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రోజు విడుదల కాబోయే Moto G34 5G స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల IPS LCD డిస్ప్లే, 50MP క్వాడ్ పిక్సెల్ కెమెరాతో విడుదల కాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ మొబైల్ Snapdragon 695 ప్రాసెసర్‌పై పని చేయబోతోంది. ముందుగా ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిఫ్‌కార్ట్‌లోకి అందుబాటులో రానుంది. ఆ తర్వాత మోటరోలా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం..Moto G34 సిరీస్‌లో అత్యంత వేగవంతమైన 5G సేవలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Moto G34 ధర వివరాలు:
ఈ Moto G34 స్మార్ట్ ఫోన్ 4GB+128GB వేరియంట్‌తో మార్కెట్‌లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ముందు ఈ మొబైల్‌ని కేవలం ఒకే వేరియంట్‌లో విడుదల చేసి, విక్రయాలను బట్టి మరో వేరియంట్‌లో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇక ఈ మొబైల్ ధర విషయానికొస్తే..4GB+128GB వేరియంట్ రూ. 10,000 ధరలో అందుబాటులో ఉంటుంది.
Moto G34 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ వివరాలు:
✾ ఈ స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో రాబోతోంది.
✾ Moto G34 ఫోన్ VoNR సపోర్ట్‌తో 13 5G బ్యాండ్‌లతో వస్తోందని కంపెనీ తెలిపింది. ఇది వేగవంతమైన 5G సేవలను కలిగి ఉంటుంది.
✾ ఈ స్మార్ట్ ఫోన్ 50 మెగాపిక్సెల్ క్వాడ్ పిక్సెల్ కెమెరాతో విడుదల కానుంది.
✾ Moto G34 మొబైల్ ప్రీమియం లెదర్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.
✾ చార్‌కోల్ బ్లాక్, ఐస్ బ్లూ, ఓషన్ గ్రీన్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రానున్నాయి.
✾ Moto G34 మొబైల్ డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది.
✾ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 5,000mAh బ్యాటరీతో రాబోతోంది.
Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter