PPF Maturity: ప్రతి ఒక్కరికీ వృద్దాప్యంలో అంటే రిటైర్మెంట్ తరువాత జీవిత సంరక్షణకు ఉపయోగపడే అద్భుతమైన పధకం పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్. దీర్ఘకాలిక సేవింగ్స్ ట్యాక్స్ మినహాయింపు కావాలంటే పీపీఎఫ్ ఒక్కటే సరైన ప్రత్యామ్నాయం. పీపీఎఫ్ ద్వారా ఏడాదికి 1.5 లక్షల రూపాయలు సెక్షన్ 80 సి ప్రకారం ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు.
పీపీఎఫ్‌లో ఏడాదికి 1.5 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. కనీస మొత్తం ఏడాదికి 500 రూపాయలు పెట్టుబడి చేయాల్సి ఉంటుంది. ఏడాదికి 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. 15 ఏళ్ల మెచ్యూరిటీ కలిగి ఉంటుంది. అంటే ఇన్వెస్ట్ చేయాల్సిన కనీస వ్యవధి 15 ఏళ్లు. 15 ఏళ్లు మెచ్యూరిటీ పూర్తయ్యాక కావాలంటే మరో ఐదేళ్ల చొప్పున పొడిగించవచ్చు. పీపీఎఫ్‌లో తిరిగి ఇన్వెస్ట్ చేయకుండా కూడా పొడిగించుకోవచ్చు. లేదా పీఎఫ్ ఎక్కౌంట్లో డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు.
మీ దగ్గర ఉన్న డబ్బుల్ని బట్టి మరెక్కడైనా సురక్షితమైన విధానంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్‌లో స్థలం లేదా ఫ్లాట్ కొనుగోలుకు ఇన్వెస్ట్ చేయవచ్చు. కాస్త రిస్క్ తీసుకునే పరిస్థితి ఉంటే రుణ రంగంలో పెట్టుబడి పెట్టవచ్చు. రుణాలకు సంబంధించి హైబ్రిడ్ మ్యూచ్యువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. రిస్క్ ఎక్కువగా తీసుకునేట్టయితే డైనమిక్ ఫండ్స్‌లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేస్తే 11-12 శాతం రిటర్న్స్ పొందవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook