APPSC Group 2: మెురాయిస్తున్న ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌.. రేపే గ్రూప్-2కు లాస్ట్ డేట్..

APPSC Group 2: ఏపీపీఎస్సీ జారీ చేసిన గ్రూప్-1, 2 పోస్టుల దరఖాస్తు ప్రక్రియలో సాంకేతి సమస్యలు తలెత్తుతున్నట్లు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సాంకేతిక సమస్యలు తొలగించడంతోపాటు గడువు తేదీ పొడిగించాలని అభ్యర్థులు కోరుతున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2024, 07:53 PM IST
APPSC Group 2: మెురాయిస్తున్న ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌.. రేపే గ్రూప్-2కు లాస్ట్ డేట్..

APPSC Group 2 Application Process: గత నెలలో గ్రూప్‌1, 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను జారీచేసింది ఏపీపీఎస్సీ. గ్రూప్‌ 2 పోస్టులకు డిసెంబరు 21 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అప్లై చేసుకోవడానికి జనవరి 10 తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. అయితే ఎగ్జామ్ కు ముందే అభ్యర్థులకు చుక్కలు చూపిస్తుంది ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి సర్వర్ డౌన్ లో ఉంది. సైట్ ఓపెన్ అయిన కొంత సేపటికే మళ్లీ బ్యాక్ వచ్చేస్తోంది. ఒకవేళ పేమెంట్ అయినప్పటికీ దరఖాస్తు సబ్మిట్‌ కావట్లేదు. గ్రూప్‌1 దరఖాస్తులకు కూడా ఇదే సమస్య తలెత్తుతోంది. అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నా ఏపీపీఎస్సీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అయితే గ్రూప్2 అప్లికేషన్ గడువు తేదీ పెంచాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. 

డిసెంబరులో 897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసింది. ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566 ఉన్నాయి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను ఫిబ్రవరి 25 నిర్వహించనున్నట్లు కమిషన్ పేర్కొంది. ఈ పోస్టులకు లక్షల్లో నిరుద్యోగులు పోటీపడుతుంటారు. కానీ సర్వర్ మెరాయిస్తున్న నేపథ్యంలో అనుకున్నంత స్థాయిలో దరఖాస్తులు రాలేదని తెలుస్తోంది. 

గ్రూప్-2  సిలబస్ ఇదే..
ప్రిలిమ్స్ 
జనరల్ స్టడీస్- 150 మార్కులు
a) భారతదేశ చరిత్ర- 30 మార్కులు
b) భూగోళశాస్త్రం- 30 మార్కులు
c) భారతీయ సమాజం- 30 మార్కులు
d) కరెంట్ ఆఫైర్స్- 30 మార్కులు
e) మెంటల్ ఎబిలిటీ- 30 మార్కులు 
మెయిన్స్ 
పేపర్ 1- ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర & భారత రాజ్యాంగం- 150 మార్కులు
పేపర్ 2- భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ & సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ- 150 మార్కులు

Also Read: Lok Sabha Elections 2024: వైసీపీ ఎంపీ అభ్యర్థులు వీళ్లే.. కీలక స్థానాల్లో కొత్త వాళ్లకు ఛాన్స్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News