Makar Sankranti Special Story 2024: ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరూ పంచాంగ శ్రవణం వింటూ ఉంటారు. ఇందులో మనం తరచుగా వినే పేర్లలో సంక్రాంతి పురుషుడు ఒకటి..ఈ పేరు ప్రతిసారి వినిపిస్తూనే ఉంటుంది. అంతేకాకుండా సిద్ధాంతాలు ఆయనకు సంబంధించిన రూపాన్ని లక్షణాలను గురించి ఎంతో ప్రత్యేకంగా పంచాంగ శ్రవణంలో భాగంగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఈ పంచాంగ పురుషుడు పట్టుకున్న ఆయుధాంతోపాటు ఆయన రూపురేఖలు, వాహనం.. ఇవన్నీ ఉగాది కొత్త సంవత్సరంలో ఫలితాన్ని ఇస్తాయని నమ్ముతారు. ఇంత ప్రాముఖ్యత కలిగిన సంక్రాంతి పురుషుడు ఎవరు? ఎందుకు ప్రతి సంవత్సరం పంచాంగ శ్రవణంలో భాగంగా ఆయనను ప్రస్తావిస్తారు? సంక్రాంతి పురుషుడికి సంక్రాంతికి ఏమైనా సంబంధం ఉందా? వీటన్నిటికీ సంబంధించిన సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మకర సంక్రాంతి రోజు ఏర్పడే సూర్య శక్తిని సంక్రాంతి పురుషుడు అని పిలుస్తారు. ఈ సూర్యశక్తికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అందుకే ఈరోజు చాలామంది స్నానం చేసిన తర్వాత సూర్యకిరణాలు పడేటట్లు ఎండలో నిలబడి ఉంటారు. అయితే రవి సంక్రమణ జరిగినప్పుడు ఆ సమయంలో ఉన్న తిథి నక్షత్రం వారాన్ని అనుసరించి సంక్రాంతి పురుషుడి లక్షణాలను అనుగ్రహాన్ని మన పూర్వీకులు వివరించారు. అయితే 2024 సంవత్సరంలో సూర్యుడు జనవరి 15వ తేదీన మకర రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అదే రోజు సోమవారం రావడంతో మకర సంక్రాంతిని జరుపుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ప్రతి సంవత్సరం సిద్ధాంతలు మకర సంక్రమణ సమయాన్నిబట్టి సంక్రాంతి పురుషుడి లక్షణాలను నిర్దేశించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పురుషుడు మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి సంక్రాంతి పండగను జరుపుకునే వారు సంక్రాంతి పుణ్యకాలం నుంచి జరుపుకోవడం ప్రతి సంవత్సరం ఓ ఆనవాయితీగా వస్తోంది.
Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
ముఖ్యంగా నోముల నాచరించే వారు ఈ పుణ్యకాలానికి ముందే ఆచరించడం మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ సంక్రమణ సమయంలో మిత్రులకు తర్పణం ఇవ్వడం వల్ల కూడా ఎంతో మేలు జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. ముఖ్యంగా మకర సంక్రాంతి రోజు మరిచిపోనిది ఏమిటంటే.. ఈరోజు తప్పకుండా సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు చేయడం ఎంతో శ్రేయస్కరం..
Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter