Supreme Court Judgement: స్కిల్ క్వాష్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఎల్లుండే

Supreme Court Judgement: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తీర్పు వెలువడే తేదీ ఖరారైంది. మరో రెండ్రోజుల్లో చంద్రబాబు భవితవ్యం తేలనుంది. దేశమంతా ఆసక్తి రేపిన ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్టు సక్రమమో, అక్రమమో తేలిపోనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 14, 2024, 10:06 AM IST
Supreme Court Judgement: స్కిల్ క్వాష్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఎల్లుండే

Supreme Court Judgement: ఏపీ స్కిల్  కుంభకోణం కేసులో నిందితుడైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై సుప్రీంకోర్టులో తీర్పు ఎప్పుడు వెలువడేది తేలిపోయింది. ఈనెల 16న అంటే మరో రెండ్రోజుల్లో క్వాష్ పిటీషన్‌పై తీర్పు వెలువడనుందని సుప్రీంకోర్టు వర్గాలు స్పష్టం చేశాయి. 

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో 52 రోజులున్నారు. ఆ తరువాత తొలుత మద్యంతర బెయిల్‌పై అనంతరం పూర్తి స్థాయి బెయిల్‌తో విడుదలై బయట ఉన్నారు. సెక్షన్ 409 అవినీతి కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు సెక్షన్ 17ఎ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోనందున తన అరెస్టు అక్రమమని , కేసు కొట్టివేయాలని ముందుగా ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఆ తరువాత ఏపీ హైకోర్టుకు వెళ్లారు. సెప్టెంబర్ 22వ తేదీన హైకోర్టు కూడా చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ కేసును కొట్టివేసింది. దాంతో ఇక సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

సుప్రీంకోర్టులో జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ఈ కేసుపై సుదీర్ఘంగా విచారించింది. రోజంతా వాదనలు విన్నది. సెక్షన్ 17ఎ చంద్రబాబు అరెస్ట్ అయిన కేసుకు వర్తిస్తుందా లేదా అనే అంశంపైనే ప్రధానంగా వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టుకు చెందిన బడా న్యాయవాదులు ఇరువర్గాల్నించి వాదనలు విన్పించారు. దీపాళికి ముందే ఈ కేసులో విచారణ ముగిసింది. సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. తొలుత నవంబర్ 8న తీర్పు వెలువడుతుందని ఆశించినా ఆ తరువాత వాయిదా పడుతూ వచ్చింది. 

ఈ కేసులో తీర్పు ఎప్పుడు వెలుడుతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. మొత్తానికి ఈ కేసులో తీర్పు ఎప్పుడు వెలువడేది నిర్ణయమైంది. జనవరి 16వ తేదీన అంటే మరో రెండ్రోజుల్లో సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుంది. ఈ తీర్పు చంద్రబాబు భవితవ్యాన్ని నిర్ణయించనుంది. ఒకవేళ తీర్పు చంద్రబాబుకు వ్యతిరేకంగా వస్తే ఆ ప్రభావం ఈ కేసులో హైకోర్టు జారీ చేసిన బెయిల్‌పై కూడా ప్రభావం చూపించవచ్చు.

Also read: DSC Notification: గుడ్‌న్యూస్, త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్, ఎన్ని పోస్టులంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News